logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల బాట – కలెక్టర్ దివాకర పిలుపు ములుగు జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టి లాభాలు పొందాలని కలెక్టర్ దివాకర సూచించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మల్లంపల్లి రైతు వేదికలో జరిగిన మండల సభలో ఆయన మాట్లాడారు. ఎకరాకు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం రూ.40 వేల సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు. ములుగులోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల రైతులు స్థానికంగానే పంటను విక్రయించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో రైతులకు లాభాలతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

4 days ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 days ago

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల బాట – కలెక్టర్ దివాకర పిలుపు ములుగు జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టి లాభాలు పొందాలని కలెక్టర్ దివాకర సూచించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మల్లంపల్లి రైతు వేదికలో జరిగిన మండల సభలో ఆయన మాట్లాడారు. ఎకరాకు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం రూ.40 వేల సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు. ములుగులోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల రైతులు స్థానికంగానే పంటను విక్రయించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో రైతులకు లాభాలతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ జిల్లా:పరకాల మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూమిపై నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ATC) కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమి పరిమాణం, స్థల అనుకూలత, అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆయన వివరంగా ఆరా తీశారు. ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్రం నిర్మాణం వేగంగా పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన నిధులు, సౌకర్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం లేకుండా సమయపాలనతో ముందుకు సాగాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టును అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    హన్మకొండ జిల్లా:పరకాల మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూమిపై నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ATC) కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమి పరిమాణం, స్థల అనుకూలత, అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆయన వివరంగా ఆరా తీశారు.
ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్రం నిర్మాణం వేగంగా పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన నిధులు, సౌకర్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనుల్లో ఆలస్యం లేకుండా సమయపాలనతో ముందుకు సాగాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టును అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
    2
    వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
    1
    ప్రజాపాలన -  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు  రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి,
మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, 
ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు,
ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,
వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, 
అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, 
పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు,
అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు,
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు,
కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
-
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.  వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును  దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు  తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
    1
    👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు.
👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు.
👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు.
👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు.
👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా.
➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
    1
    జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.