logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోస్రా ప్రభుత్వ బడుల్లో చెస్ సందడి.. విద్యార్థులకు ఉచిత చెస్ బోర్డులు, చెస్‌ ద్వారా క్రమశిక్షణ, సహనం, వ్యూహాత్మక ఆలోచనకు శిక్షణ, గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న చెస్‌ ప్రతిభకు ప్రోత్సాహం మోస్రా, (సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా : ప్రతినిధి రాహుల్: విద్యార్థుల్లో చెస్‌పై ఆసక్తిని పెంపొందించి, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో మోస్రా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత చెస్ బోర్డు సెట్లను పంపిణీ చేశారు. చెస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ ఆత్మ చరణ్ రెడ్డి సహకారంతో, కాకతీయ శాండ్‌బాక్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మోస్రా జడ్పీహెచ్ఎస్, లో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, తార్కిక ఆలోచన, ఓర్పు, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే మేధో క్రీడ అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా చెస్ బోర్డులు అందించడం ద్వారా విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే క్రీడపై ఆసక్తి పెంచే అవకాశం కలుగుతుందన్నారు. చెస్ నెట్‌వర్క్ సభ్యుడు, సాయి సమాల చెస్ అకాడమీ, బోధన్ వ్యవస్థాపకుడు, చెస్ కోచ్ అండ్ మెంటర్ సాయిబాబా సామల విద్యార్థులకు చెస్ ప్రాముఖ్యత, శిక్షణ ద్వారా లభించే అవకాశాలను వివరించారు. ప్రతిభ, ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదిగేలా శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తానని తెలిపారు. చెస్ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ కోచ్ సాయిబాబా సామల, చెస్ నెట్‌వర్క్ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డిలను ఎంఈఓ, నాగనాథ్, ప్రధానోపాధ్యాయులు బి. సాయిలు సన్మానించారు. సాయి సమాల చెస్ అకాడమీ ద్వారా ఇప్పటికే విద్యార్థులకు క్రమబద్ధమైన శిక్షణ అందిస్తూ, జిల్లా స్థాయిలో అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌లు, రన్నరప్ స్థానాలు సాధించేలా మార్గదర్శ కత్వం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ బోర్డులు అందుబాటులోకి రావడంతో మరింత మంది విద్యార్థులు క్రీడను నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల ఎంఈఓ నాగనాథ్, జెడ్ పి హెచ్ ఎస్, ప్రధానో పాధ్యాయులు బి. సాయిలు, చెస్ నెట్‌వర్క్ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

17 hrs ago
user_RAHUL
RAHUL
బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
17 hrs ago
15d90d09-9219-4d00-bb5f-81b723622407

మోస్రా ప్రభుత్వ బడుల్లో చెస్ సందడి.. విద్యార్థులకు ఉచిత చెస్ బోర్డులు, చెస్‌ ద్వారా క్రమశిక్షణ, సహనం, వ్యూహాత్మక ఆలోచనకు శిక్షణ, గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న చెస్‌ ప్రతిభకు ప్రోత్సాహం మోస్రా, (సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా : ప్రతినిధి రాహుల్: విద్యార్థుల్లో చెస్‌పై ఆసక్తిని పెంపొందించి, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో మోస్రా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత చెస్ బోర్డు సెట్లను పంపిణీ చేశారు. చెస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ ఆత్మ చరణ్ రెడ్డి సహకారంతో, కాకతీయ శాండ్‌బాక్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మోస్రా జడ్పీహెచ్ఎస్, లో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, తార్కిక ఆలోచన, ఓర్పు, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే మేధో క్రీడ అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా చెస్ బోర్డులు అందించడం ద్వారా విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే క్రీడపై ఆసక్తి పెంచే అవకాశం కలుగుతుందన్నారు. చెస్ నెట్‌వర్క్ సభ్యుడు, సాయి సమాల చెస్ అకాడమీ, బోధన్ వ్యవస్థాపకుడు, చెస్ కోచ్

bda3eb9f-2b83-4958-8be0-1d744c047583

అండ్ మెంటర్ సాయిబాబా సామల విద్యార్థులకు చెస్ ప్రాముఖ్యత, శిక్షణ ద్వారా లభించే అవకాశాలను వివరించారు. ప్రతిభ, ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదిగేలా శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తానని తెలిపారు. చెస్ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ కోచ్ సాయిబాబా సామల, చెస్ నెట్‌వర్క్ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డిలను ఎంఈఓ, నాగనాథ్, ప్రధానోపాధ్యాయులు బి. సాయిలు సన్మానించారు. సాయి సమాల చెస్ అకాడమీ ద్వారా ఇప్పటికే విద్యార్థులకు క్రమబద్ధమైన శిక్షణ అందిస్తూ, జిల్లా స్థాయిలో అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌లు, రన్నరప్ స్థానాలు సాధించేలా మార్గదర్శ కత్వం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ బోర్డులు అందుబాటులోకి రావడంతో మరింత మంది విద్యార్థులు క్రీడను నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల ఎంఈఓ నాగనాథ్, జెడ్ పి హెచ్ ఎస్, ప్రధానో పాధ్యాయులు బి. సాయిలు, చెస్ నెట్‌వర్క్ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా.... టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వోకు ఫిర్యాదు ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు. రూ.13,325 జరిమానా అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు. అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు. అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    1
    టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా....
టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా
అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు
డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17
గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
డీఎఫ్‌వోకు ఫిర్యాదు
ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.
ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు.
రూ.13,325 జరిమానా
అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు.
అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.
అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే
అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు.
అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...
    1
    బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు...
నిర్మల్ జిల్లా // బాసర 
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...*
13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్*
*ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు..
ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. :
*సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్*
బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.
    1
    చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి
ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    1
    నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ...........
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం,  ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, *సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..* 🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, ▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. 🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
*సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..*        
🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 
🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.         
🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
  • కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
•	వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ  
•	నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు
•	నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు
•	గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
•	డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ
కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర,  బుధవారం పరిశీలించారు.
తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ  సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్,  మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు  చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు, 2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    1
    *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక  నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ 
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు,
2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే.
రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    21 hrs ago
  • నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    1
    నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత 
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.