కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు గంగారం పిలుపు ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపు గడ్కోల్‌లో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న పాలక వర్గాల విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాటాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గడ్కోల్‌లో గురువారం మూడవ రోజు కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పోటు రంగారావు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల చిరు వ్యాపారులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. రైతుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై బోధన రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవ రోజు ‘భూగోళ చరిత్ర’ అంశాన్ని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు బోధించగా, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అంశంపై జీ. భార్గవ్ బోధించారు. కార్యక్రమంలో సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగయ్య, కట్ట రమా, వి. ప్రభాకర్, వి. కృష్ణ, చిన్న చంద్రన్న, ఎం. కృష్ణ, సూర్యం, హన్మేశ్, ఎస్.ఎల్. పద్మతో పాటు రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, బి. రాము, జి. రామయ్య, సి.వై. పుల్లయ్య, నందిరామయ్య, జిల్లా నాయకులు ఆర్. రమేష్, బి. దేవరం, ఆర్. దామోదర్, బి. బాబన్న, కిషోర్, రమేష్, రమ, సత్తెమ్మ, పుష్ప, జమున, లావణ్య తదితరులు పాల్గొన్నారు.2
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- మాల మహానాడు ఆధ్వర్యంలో బోధన్‌లో నిరసన, అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు.. దళిత సంఘ నాయకులు ఆగ్రహం బోధన్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయనపై తప్పుడు ప్రచారానికి దారితీసే విధంగా పుస్తకాన్ని రచించి విడుదలకు ప్రయత్నించడం దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యలని అన్నారు. అంబేద్కర్ కృషి, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు, ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు దళిత సమాజం ఐక్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- ప్రెస్ నోట్ తేదీ 17-09-2026 మెదక్ జిల్లా దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి --మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా వికలాంగుల కు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మోదీ గారు గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 దివ్యంగా సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.దివ్యాంగులు మొన్న జరిగిన గ్లాస్ కో క్రీడల్లో ప్రపంచంలో 4 వ స్థానం సాధించి 39 పథకాలు ఇండియాకు తీసుకొచ్చారని , ఇన్ని పథకాలు ఏ క్రీడలకు కూడా ఇండియాకు రాలేదని, దివ్యాంగులు ఎవరికి తక్కువకాని , ఆత్మవిశ్వాసంతో జీవించాలని అన్నారు.దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం1