logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యుత్ రంగం బలోపేతమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం నిరంత‌రం నాణ్య‌మైన విద్యుత్ అంద‌రికీ అందాలి సూర్య‌ఘ‌ర్, కుసుమ్, ఆర్డీఎస్ఎస్ ప‌నులు వేగ‌వంతం చేయండి ప్రతీ నియోజ‌క‌వ‌ర్గంలో ‘మోడ‌ల్ సోలార్ విలేజ్’ వినియోగదారుల సంతృప్తి స్థాయి 90 శాతానికి పెర‌గాలి ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ తో పాటు నెడ్ క్యాప్ అధికారుల‌తో మంత్రి గొట్టిపాటి స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ నిరంత‌రం నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ చేప‌ట్టాల‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య‌ఘ‌ర్, అగ్రికల్చర్ కనెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌న్నారు. పెండింగ్ లో ఉన్న వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లను సీజ‌న్ మొద‌ల‌య్యేనాటికి మంజూరు చేయాల‌న్నారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లో ఓల్టేజ్ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డానికి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. విద్యుత్ భారాలను, న‌ష్టాల‌ను త‌గ్గించుకోవడానికి సోలార్ వంటి పున‌రుత్పాద‌క ఇంధ‌నాల వినియోగం పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందులో భాగంగా నియోజ‌కవ‌ర్గానికో మోడ‌ల్ సోలార్ విలేజ్ ను అభివృద్ధి చేయాల‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. అదే విధంగా వినియోగ‌దారుల సంతృప్త స్థాయిని 90 శాతానికి పెంచాల‌ని అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. *ముందుగా ఏపీసీపీడీసీఎల్, నెడ్ క్యాప్ అధికారుల‌తో....* స‌చివాల‌యంలోని మంత్రి కార్యాల‌యంలో ముందుగా సీపీడీసీఎల్, నెడ్ క్యాప్ అధికారుల‌తో మంత్రి గొట్టిపాటి స‌మీక్ష నిర్వ‌హించారు. వివిధ అంశాల‌పై చ‌ర్చించిన ఆయ‌న, సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేసే దిశ‌గా., వినియోగదారుల అనుమతితో పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలోనూ అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. మెటీరియల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు ఉచిత సోలార్ క‌నెక్ష‌న్ల‌తో పాటు వేసవి ముగిసే నాటికి ప్రతి నియోజకవర్గంలో కనీసం 6 వేల సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా, వచ్చే నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని మంత్రి పేర్కొన్నారు. సోలార్ ప్యానెల్స్ వినియోగం, పీఎల్ఎఫ్ పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలిపిన మంత్రి గొట్టిపాటి.. పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని, భూ కేటాయింపుల విషయంలో జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సీపీడీసీఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 11 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలని తెలిపారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారుల‌ను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల్లో కొనుగోలుదారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల స‌హ‌కారంతో కేసులు నమోదు చేయించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్యల ప‌రిష్కారానికి ఇప్పటికే 980 ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సంద‌ర్భంగా మంత్రికి వివ‌రించారు. *ఎస్పీడీసీఎల్ ప‌రిధిలో.....* స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు మంత్రి గొట్టిపాటి ఎస్పీడీసీఎల్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై మంత్రి గొట్టిపాటి అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సూచ‌న‌ల‌తో మూడు నెల‌ల్లో ఆర్డీఎస్ఎస్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్నారు. పీఎల్ఎఫ్ ను పెంచే దిశ‌గా వినియోగ‌దారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. ఎస్పీడీసీఎల్ ప‌రిధిలో పీఎం సూర్య‌ఘ‌ర్, ఆర్డీఎస్ఎస్, అగ్రిక‌ల్చ‌ర్ క‌నెక్ష‌న్లు, లో ఓల్టేజ్ స‌మ‌స్య‌ల‌పై ఆరా తీసిన మంత్రి వాటిని ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఎంతో ఉప‌యుక్త‌మైన‌ పీఎం సూర్య‌ఘ‌ర్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను గ‌త ప్ర‌భుత్వం ఉప‌యోగించుకోలేద‌ని మంత్రి గొట్టిపాటి విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చేప‌డుతున్న సూర్య‌ఘ‌ర్ ప‌నుల్లో అత్య‌ధిక‌ నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌న్నారు. పీఎం సూర్య‌ఘ‌ర్, కుమ‌మ్ ప‌థ‌కాల ద్వారానే ట్రాన్స్ మిష‌న్ న‌ష్టాల‌ను త‌గ్గించుకోవ‌చ్చని ఆయ‌న పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల మంజూరులో ఆటంకాలు తొల‌గించి ఆల‌స్యం లేకుండా చూడాల‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో లో ఓల్టేజ్ స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌టం ద్వారా వినియోగ‌దారుల సంతృప్త స్థాయి పెంచ‌వ‌చ్చ‌ని తెలిపారు. అదే విధంగా వినియ‌దారుల స‌మ్మ‌తి మేర‌కు మాత్ర‌మే స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించాల‌ని మంత్రి గొట్టిపాటి అధికారుల‌కు సూచించారు. స‌మీక్ష‌ల్లో సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్, డైర‌క్ట‌ర్లు, నెడ్ క్యాప్ అధికారుల‌తో పాటు ఇంధ‌న శాఖకు చెందిన ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Mallikarjuna
Mallikarjuna
Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    1
    ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    17 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు.
అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    1
    ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం  వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    1
    రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 
7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
    1
    బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు.
కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో  బాధితులు ఫిర్యాదు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.
    1
    వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    7 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది…
పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు…
ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు…
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.