logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*మార్జిన్ పెంచకపోతే చికెన్ సెంటర్లు బంద్ చేస్తాం* *-శ్రమ మాది.. లాభం పౌల్ట్రీ కంపెనీలది* -కంపెనీల వ్యవహారంతో తీవ్రంగా నష్టపోతున్నాం *-చికెన్ సెంటర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్* పౌల్ట్రీ కంపెనీలు చికెన్ సెంటర్ యాజమాన్యాలకు మార్జిన్ పెంచని ఎడల ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సామూహికంగా బంద్ నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ తాలూకా చికెన్ సెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షలు తీగల సుభాష్,ఉపాధ్యక్షలు సుల్తాన్, కార్యదర్శి మహమ్మద్ జహంగీర్, దివాకర్ రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు చికెన్ సెంటర్ నిర్వాహకులకు తక్కువ మార్జిన్ అందిస్తూ ఉండడం వల్ల తమకు గిట్టుబాటు కాక వర్కర్స్ జీతాలు దుకాణాల కిరాయిలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. చికెన్ సెంటర్ యాజమాన్యం సమక్షంలో సమావేశం నిర్వహించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి సామూహికంగా బందు పాటించాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ నిర్వాహకుల యాజమాన్యుల ఆధ్వర్యంలో యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు నాగర్కర్నూల్ తాలూకాలో కూడా పూర్తిస్థాయిలో బంద్ పాటించాలని ఇందుకోసం ప్రతి చికెన్ సెంటర్ నిర్వాహకుడు సహకరించాలని కోరారు. పౌల్ట్రీ కంపెనీల ఆధిపత్యంతో తీవ్రంగా నలిగిపోతున్నది చికెన్ సెంటర్ నిర్వాహకులే అన్నారు. తాము ఉపాధి పొందుతూ నలుగురికి పని కల్పించి ఉపాధి కల్పించే చికెన్ సెంటర్ నిర్వహణ భారంగా మారి అప్పులపాలు అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యాలకు ప్రభుత్వాల ద్వారా నియంత్రణ లేకపోవడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుందని, ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ తమకు మాత్రం తక్కువ మార్జిన్ చెల్లిస్తూ ఉండడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యం తమ డిమాండ్కు అనుగుణంగా మార్జిన్ పెంచని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పౌల్ట్రీ యాజమాన్యాల సారథ్యంలోని చికెన్ దుకాణాలను సైతం బందు చేయిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ యాజమాన్యాలపై నియంత్రణ ఉండే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు వారి వద్ద కోళ్లను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న చికెన్ సెంటర్ ల నిర్వాహకులకు మెరుగైన ఉపాధి కోసం ఆలోచన చేయాలని వారు ఈ మేరకు డిమాండ్ చేశారు. పౌల్ట్రీ యాజమాన్యం చికెన్ సెంటర్ నిర్వాహకులకు మెరుగైన మార్జిన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అలా జరగని పక్షంలో ఒకటవ తేదీ నుంచి దుకాణాలు మూసి నిరసన తెలుపుతామని వారు పేర్కొన్నారు.

9 hrs ago
user_T.Shiva Krishna
T.Shiva Krishna
బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
9 hrs ago

*మార్జిన్ పెంచకపోతే చికెన్ సెంటర్లు బంద్ చేస్తాం* *-శ్రమ మాది.. లాభం పౌల్ట్రీ కంపెనీలది* -కంపెనీల వ్యవహారంతో తీవ్రంగా నష్టపోతున్నాం *-చికెన్ సెంటర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్* పౌల్ట్రీ కంపెనీలు చికెన్ సెంటర్ యాజమాన్యాలకు మార్జిన్ పెంచని ఎడల ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సామూహికంగా బంద్ నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ తాలూకా చికెన్ సెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షలు తీగల సుభాష్,ఉపాధ్యక్షలు సుల్తాన్, కార్యదర్శి మహమ్మద్ జహంగీర్, దివాకర్ రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు చికెన్ సెంటర్ నిర్వాహకులకు తక్కువ మార్జిన్ అందిస్తూ ఉండడం వల్ల తమకు గిట్టుబాటు కాక వర్కర్స్ జీతాలు దుకాణాల కిరాయిలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. చికెన్ సెంటర్ యాజమాన్యం సమక్షంలో సమావేశం నిర్వహించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి సామూహికంగా బందు పాటించాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ నిర్వాహకుల యాజమాన్యుల ఆధ్వర్యంలో యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు నాగర్కర్నూల్ తాలూకాలో కూడా పూర్తిస్థాయిలో బంద్ పాటించాలని ఇందుకోసం ప్రతి చికెన్ సెంటర్ నిర్వాహకుడు సహకరించాలని కోరారు. పౌల్ట్రీ కంపెనీల ఆధిపత్యంతో తీవ్రంగా నలిగిపోతున్నది చికెన్ సెంటర్ నిర్వాహకులే అన్నారు. తాము ఉపాధి పొందుతూ నలుగురికి పని కల్పించి ఉపాధి కల్పించే చికెన్ సెంటర్ నిర్వహణ భారంగా మారి అప్పులపాలు అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యాలకు ప్రభుత్వాల ద్వారా నియంత్రణ లేకపోవడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుందని, ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ తమకు మాత్రం తక్కువ మార్జిన్ చెల్లిస్తూ ఉండడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యం తమ డిమాండ్కు అనుగుణంగా మార్జిన్ పెంచని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పౌల్ట్రీ యాజమాన్యాల సారథ్యంలోని చికెన్ దుకాణాలను సైతం బందు చేయిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ యాజమాన్యాలపై నియంత్రణ ఉండే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు వారి వద్ద కోళ్లను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న చికెన్ సెంటర్ ల నిర్వాహకులకు మెరుగైన ఉపాధి కోసం ఆలోచన చేయాలని వారు ఈ మేరకు డిమాండ్ చేశారు. పౌల్ట్రీ యాజమాన్యం చికెన్ సెంటర్ నిర్వాహకులకు మెరుగైన మార్జిన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అలా జరగని పక్షంలో ఒకటవ తేదీ నుంచి దుకాణాలు మూసి నిరసన తెలుపుతామని వారు పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    9 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
  • full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action
    1
    full night open this hotel purani Haveli 
request to Hyderabad City Police take action
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    23 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    6 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.