Shuru
Apke Nagar Ki App…
అనంతగిరి కళాశాల విద్యార్థుల మొర వినండి, ఎంపీడీఓకు వినతి పత్రం అల్లూరి జిల్లా,అనంతగిరి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు దశాబ్దాలుగా హాస్టల్ వసతి లేక నానా అవస్థ పడుతున్నారు. బయట గదులను అద్దెకి తీసుకొని ఆర్థిక భారాన్ని మోస్తున్న దుస్థితిపై జై భారత్ నేషనల్ పార్టీ, అరకు పార్లమెంటు అధ్యక్షులు బి.చంటిబాబు స్పందించారు. విద్యార్థులతో కలిసి సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ నిర్మాణానికి విధులు మంజూరు చేసి,విద్యార్థుల విద్యాభ్యాసానికి వసంతులు కనిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Laxman Regam
అనంతగిరి కళాశాల విద్యార్థుల మొర వినండి, ఎంపీడీఓకు వినతి పత్రం అల్లూరి జిల్లా,అనంతగిరి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు దశాబ్దాలుగా హాస్టల్ వసతి లేక నానా అవస్థ పడుతున్నారు. బయట గదులను అద్దెకి తీసుకొని ఆర్థిక భారాన్ని మోస్తున్న దుస్థితిపై జై భారత్ నేషనల్ పార్టీ, అరకు పార్లమెంటు అధ్యక్షులు బి.చంటిబాబు స్పందించారు. విద్యార్థులతో కలిసి సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ నిర్మాణానికి విధులు మంజూరు చేసి,విద్యార్థుల విద్యాభ్యాసానికి వసంతులు కనిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1