logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద పుస్తకం: హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో మాల మహానాడు ఫిర్యాదు ​అచ్చంపేట, సెప్టెంబర్ 16(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద పుస్తకం రచిస్తున్న హమారా ప్రసాద్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో బుధవారం నియోజకవర్గ మాల మహానాడు నాయకులు బుధవారం అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ​డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తూ హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలందరి గౌరవాన్ని పొందుతున్న మహానాయకునిపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందని మాల మహానాడు ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ​ఈ వ్యాఖ్యలను మరియు సంబంధిత విషయాలను సమగ్రంగా పరిశీలించి, హమారా ప్రసాద్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను వారు కోరారు.

1 hr ago
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
1 hr ago
6b7988ed-1db6-432e-8d9d-8ccc79af1335

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద పుస్తకం: హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో మాల మహానాడు ఫిర్యాదు ​అచ్చంపేట, సెప్టెంబర్ 16(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద పుస్తకం రచిస్తున్న హమారా ప్రసాద్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో బుధవారం నియోజకవర్గ మాల మహానాడు నాయకులు బుధవారం అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ​డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తూ హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలందరి గౌరవాన్ని పొందుతున్న మహానాయకునిపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందని మాల మహానాడు ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ​ఈ వ్యాఖ్యలను మరియు సంబంధిత విషయాలను సమగ్రంగా పరిశీలించి, హమారా ప్రసాద్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను వారు కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    4
    పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా 
15.09.2026

 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS.
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. 

ఆత్మకూరు:నంద్యాల జిల్లా.
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS  నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి  పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    43 min ago
  • పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా  ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన 
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
    user_ఏడుకొండలు. జర్నలిస్ట్
    ఏడుకొండలు. జర్నలిస్ట్
    Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ
వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు
రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన
హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.Nagendrudu
    P.Nagendrudu
    Media company కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    4
    సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం 
విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    1 hr ago
  • బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
    2
    బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. 
విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి  బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి  మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.
    1
    హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ.
మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_ఏడుకొండలు. జర్నలిస్ట్
    ఏడుకొండలు. జర్నలిస్ట్
    Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.