ప్రభుత్వం సహాయం అందక బలుసు ఆకు తింటూ నిరసన తెలిపిన వికలాంగులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించని తీరు నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేతృత్వంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం లో వికలాంగులు బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'అభయహస్తం' మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామని ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీతో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలకై బడ్జెట్ లో పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని మోసం చేసిన తీరు బాధాకరమని ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించి 3000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని గత రెండేళ్లుగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వికలాంగుల ఆశలపై బట్టి బడ్జెట్ నీళ్లు చల్లిందని వెంటనే బడ్జెట్ మంత్రి బట్టి తన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా వికలాంగుల సంక్షేమానికి పాటుపడేలా 3,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుధాకర్, సంఘం మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి, వెగ్గలం సత్యం, కీసర సక్కుబాయి, ఉరుముల ఆదయ్య, నరసమ్మ, ఊటుకూరి పద్మ, ముత్తమ్మ, కొల్లూరి నాగరాజు, పబ్బు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేది అన్నారు, కెసిఆర్ గారు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉన్నారన్నారు. ఇమా మోజోన్లకు సగరవేతరణం చెల్లించాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా తో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు, తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమం జరిగిందన్నారు, చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, 3110 మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చారన్నారు, 1744 మందికి ఆటోలు 940 మందికి క్యాబ్ లు ఇచ్చి ఆదుకున్నారన్నారు, మహిళల ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారన్నారు దాదాపు గజ్వేల్ లోనే 420 కుట్టుమిషన్లు ఇచ్చారన్నారు, అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో అనీసులు గుర్భ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకున్నారన్నారు, రూపాయలు 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనార్టీ గురుకులాలు, 204 జూనియర్ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులకు ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించి హాస్టల్ వసతులను కల్పించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 3310 మంది విదేశీ విద్యకు 20 లక్షల చొప్పున సాయం అందించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, మైనార్టీ స్టడీ సర్కిస్తూ తొమ్మిది 9313 మందికి ఉచిత శిక్షణ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు గజ్వేల్ పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు, మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాకు స్థలాల కేటాయింపు, మహిళల కోసం 420 కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ తోఫా, మైనార్టీ బంధు, లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను గజ్వేల్ పట్టణంలో అందించిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు చేసింది శూన్యమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని మండిపడ్డారు రంజాన్ తోఫాలు అందించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రంజాన్ తోఫాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రంజాన్ తోఫాలను తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తున్నారని ఆ మాట మరిచి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని,పేద ముస్లింలకు ఇవ్వకుండా విస్మరించడం చాలా దారుణమని మండిపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా పాలన విధానాలు ఉన్నాయని మండిపడ్డారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోదీన్ , కౌన్సిలర్ను బొగ్గుల స్వప్న సురేష్, కాముణి మురళి,మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం గుంటూరు రాజు నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపిటిసి రియాజ్ స్వామి, స్వామి చారి, హనుమంత్ రెడ్డి పుల్ల బీరయ్య , బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు1
- శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ఐ3 న్యూస్ /* *ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో నా కల సాకారం అయ్యింది.* *ఇది ఒక భావోద్వేగ సమయం*. *అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ నా దృష్టిలో ఇది ఒక ఎమోషన్*.. *ఇది ఒక వ్యక్తికో, ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ చుట్టూ పక్కల ఉన్న ఐదు జిల్లాల రైతులకు వరప్రదాయిని కానుంది.* - *మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు*1
- నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్1
- కేశంపేట్‌లోని శ్రీ శివ సీతా రామాంజనేయ దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఆధునిక ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తలసాని పవన్ కుమార్ రెడ్డి, పిల్లి అమ్రేష్ యాదవ్ ముందుండి నిర్వహించారు. ఆలయ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ లైట్లు రాత్రి వేళల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాంతివంతంగా మెరిసే ఈ లైటింగ్‌తో దేవస్థానం మరింత అందంగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఈ లైట్లు మరింత వెలుగులు నింపనున్నాయి. స్థానికులు, భక్తులు ఈ సేవను ప్రశంసిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.1
- వికారాబాద్, మన్నెగూడ : వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని మనీ కూడా వద్ద ఉన్న హిట్స్ బిఏడి కళాశాలలో ఫీజులు కట్టిన కొత్త యజమాన్యం మళ్లీ ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆదివారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళ ఏర్పడింది. ఫీజులు కట్టిన రసీదులు ఉన్న కావాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే రికార్డులను సరిచేసి నోట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/ నెంటూరు గ్రామంలో రమజాన్ పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ రమజాన్ పండుగ శాంతి, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అన్నారు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకమని, ఇటువంటి పండుగలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు అలాగే ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.4