Shuru
Apke Nagar Ki App…
నూతన చైర్మన్, వైస్ చైర్మన్, ఘన సన్మానం మెట్‌పల్లి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టి. మోహన్, పూల బొకేలను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, టీపీఓ రాజేంద్ర ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, 3వ వార్డు కౌన్సిలర్ శ్రీ బత్తుల నరేష్, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుడికందుల అజయ్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Mahammad Vaseem
నూతన చైర్మన్, వైస్ చైర్మన్, ఘన సన్మానం మెట్‌పల్లి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టి. మోహన్, పూల బొకేలను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, టీపీఓ రాజేంద్ర ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, 3వ వార్డు కౌన్సిలర్ శ్రీ బత్తుల నరేష్, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుడికందుల అజయ్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- బాన్సువాడ లో పట్ట పగలే భారీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.1
- కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. అగంతకులు కోర్టులో మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బాంబు పేలుతుందని కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. వెంటనే ఏవో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులు న్యాయవాదులు వివిధ కేసులపై కోర్టుకు హాజరైన వారంతా భయంతో బయటికి వచ్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అగంతకులు కోర్టులో అలజడి సృష్టించేందుకే బెదిరింపు మెయిల్ చేశారని భావిస్తున్నారు. అగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కోర్టులో అలజడి సృష్టించడానికే ఫేక్ బాంబు బెదిరింపుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.4
- ఆస్తి హక్కుకు సంబంధించిన ఇరుపక్షాలకు నోటి సులు పంపి వివాదం పరిష్కరించాలనిఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ పాల్పడ్డారంటూ అంటూ ఆయన కు 6నెలల జైలు శిక్ష రెండు వేలరూపాయల జరిమానావిధిస్తూ హైకోర్టు తీర్పు వెలగరించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల సర్వేనెంబర్ 284/a/2 లో 2.22 ఎకరాల భూమి హక్కులకు సంబంధించిన హైకోర్టు చేసిన ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయకపోవడం సవాల్ చేస్తూ లక్ష్మి కోర్టు ధిక్కరణకే పిటిషన్ దాఖలు చేశారు .దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ లక్ష్మీ తన తాత భూమిని మ మ్యూటేషిన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తు పైస్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు దాన్ని పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు వెలువదించాలని ఆగస్టులో హైకోర్టు ఆదేశించింది భూమిని గతంలో గంగయ్య నారాయణ సాదా బై నామాల ద్వార విక్రయించారని తహసిల్దపరిశీలించి కలెక్టర్ ధరఖాస్తూ తిరస్కరించారు. కాగా తాసిల్దార్,. ఆర్ఐఇచ్చిన నివేదిక ఆధారంగాఆమేధరఖాస్తును తిరస్కరించారు. కాగాతహశిల్దార్, ఆర్ఐ నివేదిక ల ఆదారంగాతిరస్కరించడంచెల్లదంటూ హైకోర్టు తెల్చి చెప్పింది కలెక్టర్ రాహుల్ రాజ్ ఉద్దేశపు పూర్వకంగా కోర్టు ఉత్తర్వు లను లంగించినందుకు ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైన్ శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూహైకోర్టు తీర్పు వెలవెరించారు అప్పీలు చేసుకోవాలని కోరుతూ తీర్పు అమలుకు నాలుగు వారాలపాటు నిలిపివేతకుఉత్తర్వు జారిచేశారు. హైకోర్టు తీర్పు నిరుపేదలకు ఊపిరిగా మారింది.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ రైతు వేదికలో ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అదే విధంగా పంట సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ కిష్టవ్వ దిల్ రాజ్, పులిగుండు సర్పంచ్ రామారావు, రైతులు పాల్గొన్నారు.1