Shuru
Apke Nagar Ki App…
డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. అగంతకులు కోర్టులో మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బాంబు పేలుతుందని కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. వెంటనే ఏవో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులు న్యాయవాదులు వివిధ కేసులపై కోర్టుకు హాజరైన వారంతా భయంతో బయటికి వచ్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అగంతకులు కోర్టులో అలజడి సృష్టించేందుకే బెదిరింపు మెయిల్ చేశారని భావిస్తున్నారు. అగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కోర్టులో అలజడి సృష్టించడానికే ఫేక్ బాంబు బెదిరింపుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.4
- इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం3
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు. పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.1