Shuru
Apke Nagar Ki App…
మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడి. *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది
Chunchu Ramesh
మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడి. *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ పరిధిలోని నాలుగు జెండాల వద్ద మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు కొందరు జమ్మికుంట శివారులో సమావేశమయ్యారు. డిన్నర్ తో కలిసిన ఐదుమండలాల నాయకులు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సుదీర్గంగా చర్చించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులం అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా కుటుంబసభ్యులతో కలిసి ప్యాషన్ షోలా తిరుగుతున్నాడని ఆందోళన చెందుతున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులం చెప్పేందుకు ప్రయత్నిస్తే చెప్పనివ్వకుండా నీకేం తెల్వదన్నట్లు వ్యవహరిస్తాడట. నాయకులకు సర్పంచ్, ఎంపిటీసి పదవులు తప్ప మండల జిల్లా స్థాయి పదవులు ఉండొద్దనే దోరణితో ఎమ్మెల్యే ఉన్నాడని ఆవేధన చెందుతున్నారు. ఎవరైనా ఎదురుమాట్లాడితే రౌడీషీట్ ఓపెన్ చేయుమని చెప్పే నాయకుడితో ఇక వేగలేం అంటున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.3
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1
- *ఉగాది పండుగ సందర్భంగా నాయకుల వాటాలు* కేతపల్లి గ్రామ పంచాయతీ అవినీతి చిట్టా అభివృద్ధి పేరిట కేతేపల్లి పెద్ద నాయకులు నిధుల స్వాహా! కేతపల్లి గ్రామ ప్రజలారా, మన గ్రామానికి వచ్చిన నిధులు ఎటు పోతున్నాయి? అభివృద్ధి అంటే కేవలం ఫోటోలకు ఫోజులివ్వడమేనా? మన పంచాయతీలో జరుగుతున్న అడ్డగోలు ఖర్చులను ఒక్కసారి గమనించండి. వీధి దీపాల (Street Lights) పేరుతో భారీ దోపిడీ: కేవలం రెండు నెలల వ్యవధిలో వీధి దీపాల కోసం రూ. 6,40,000/- ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే: మార్చి 17వ తేదీన: రూ. 2,08,317/- డ్రా చేశారు. మరుసటి రోజే (మార్చి 18న): మళ్ళీ రూ. 4,28,209/- డ్రా చేశారు. ఒక్క రోజు వ్యవధిలో లక్షల రూపాయల విలువ చేసే లైట్లు ఎక్కడ వేశారు? ఇది పచ్చి అవినీతి కాదా? నీటి సరఫరా మరియు పైపులైన్ మరమ్మతుల మాయాజాలం: గ్రామంలో నీటి సౌకర్యం కోసం కేటాయించిన నిధుల్లో కూడా భారీగా గోల్‌మాల్ జరిగింది: పైపులైన్ రిపేర్ల పేరుతో రూ. 1,63,000/- మరియు ఇతర వాటర్ వర్క్స్ కోసం రూ. 1,07,000/- కలిపి మొత్తం రూ. 2,70,000/- ఖర్చు చూపించారు. పనులు జరిగిన దాఖలాలు లేవు కానీ కాగితాల్లో మాత్రం లక్షల రూపాయలు మాయమయ్యాయి. పారిశుధ్యం (Sanitation) - డబుల్ ఖర్చు: గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నప్పటికీ, అదనంగా పారిశుధ్య పనుల పేరుతో రూ. 1,40,000/- ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? నిధుల దుర్వినియోగం: మన గ్రామానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా 20 లక్షల రూపాయలు, ఉపాధి హామీ (NREGS) కింద 10 లక్షల రూపాయలు వచ్చాయి. నిజమైన నాయకుడు బయట నుండి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి కానీ, వచ్చిన నిధుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు జేబులో వేసుకోవడం అభివృద్ధి అనిపించుకోదు.కేతపల్లి గ్రామ ప్రజల సొమ్మును అప్పనంగా తింటున్న కేతే పెళ్లికి చెందిన బడా బడా మేము అధికార పార్టీ నాయకులమని గ్రామ పంచాయతీ సొమ్మును వాటాల వారిగా దోచుకుంటూ అప్పనంగా తింటున్న వారందరి అందర్నీ వారిని నిలదీయాల్సిన సమయం వచ్చింది. అభివృద్ధి అంటే ఫోజులు కొట్టడం కాదు, నిజాయితీగా పని చేయడం. అంటే ఎన్ని రోజులు వాట్స్అప్ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతో పని చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టింది ఇందుకోసమేనా1
- హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, అలైబలై చేసుకున్నారు. కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీరజలి, స్థానిక నాయకులు, మైనారిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. అత్తగారి ఊరైన ఇల్లంతకుంట మండలం సీతంపేటలో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఐదవ రోజు పిట్టకు పెట్టొచ్చి ఇంట్లోకి వెళ్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పితో ఐదు రోజుల క్రితం విషపూరితమైన గన్నేరుపప్పు గ్రైండర్ చేసుకొని తాగి భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా, భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని బంధువులు ఆందోళన ఆందోళనకు దిగారు. దివ్య తండ్రి మాత్రం తన కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. భార్య ఆత్మహత్య బంధువుల ఆందోళనతో తీవ్ర మనస్థాపన చెందిన ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండి ఎస్సై దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర ఆవేదన గురిచేస్తుంది. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.4
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1