Shuru
Apke Nagar Ki App…
మధుర నగర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు మసీదులు ఈదిగాల వద్ద సామూహిక ప్రార్థనలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
మధుర నగర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు మసీదులు ఈదిగాల వద్ద సామూహిక ప్రార్థనలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- జనగామ జిల్లా: కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి 300 మందిలో 101 మందిని షార్ట్‌లిస్ట్ చేసిన అధికారులు, అర్ధరాత్రి సమాచారంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి, అకస్మాత్తుగా పరీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. షార్ట్‌లిస్ట్ అయిన వారిలో కొందరికి మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగాయని, అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1
- తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.1
- *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది1
- కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. అత్తగారి ఊరైన ఇల్లంతకుంట మండలం సీతంపేటలో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఐదవ రోజు పిట్టకు పెట్టొచ్చి ఇంట్లోకి వెళ్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పితో ఐదు రోజుల క్రితం విషపూరితమైన గన్నేరుపప్పు గ్రైండర్ చేసుకొని తాగి భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా, భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని బంధువులు ఆందోళన ఆందోళనకు దిగారు. దివ్య తండ్రి మాత్రం తన కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. భార్య ఆత్మహత్య బంధువుల ఆందోళనతో తీవ్ర మనస్థాపన చెందిన ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండి ఎస్సై దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర ఆవేదన గురిచేస్తుంది. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తేది 19-03-2026 గురువారం నుండి చైత్ర శుద్ధ నవమి తేది 27-03-2026 శుక్రవారం వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడనున్నాయి. చైత్ర శుద్ధ నవమి రోజైన 27-03-2026 శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారు ఈరోజు భీమేశ్వర సదన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగాక్యూలైన్లు చలి వేంద్రాలు, పందిళ్లు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ అన్న ప్రసాదం పంపిణీ భారీ ప్రవేశ ద్వారాలు (గేట్లు) విద్యుత్ దీపాల అలంకరణ కూలర్లు కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో అలంకరణ తో పాటు హెల్త్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్ సదుపాయం, ప్రత్యేక బస్సులు, సేవా సమితుల సహకారం, పారిశుభ్రత ఏర్పాట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి మాట్లాడుతూ, శ్రీరామనవమి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ : ఈనెల 23న తై బజార్ వేలంపాట, బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.1