శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు జిల్లా అధికారులతో ఈవో రమాదేవి సమీక్ష రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తేది 19-03-2026 గురువారం నుండి చైత్ర శుద్ధ నవమి తేది 27-03-2026 శుక్రవారం వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడనున్నాయి. చైత్ర శుద్ధ నవమి రోజైన 27-03-2026 శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారు ఈరోజు భీమేశ్వర సదన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగాక్యూలైన్లు చలి వేంద్రాలు, పందిళ్లు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ అన్న ప్రసాదం పంపిణీ భారీ ప్రవేశ ద్వారాలు (గేట్లు) విద్యుత్ దీపాల అలంకరణ కూలర్లు కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో అలంకరణ తో పాటు హెల్త్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్ సదుపాయం, ప్రత్యేక బస్సులు, సేవా సమితుల సహకారం, పారిశుభ్రత ఏర్పాట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి మాట్లాడుతూ, శ్రీరామనవమి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొండగట్టు ను సందర్శించి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాదయాత్ర నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రోజు రాత్రి కావడంతో ఆలయం మూసి వేయడం వల్ల గుడి ముందే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్రమంత్రి సంజయ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు.2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1
- భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సంస్థాగత బలోపేతమే ధ్యేయం ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.1
- దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.4
- Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.1
- Ugadhi subhakankshalu1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తేది 19-03-2026 గురువారం నుండి చైత్ర శుద్ధ నవమి తేది 27-03-2026 శుక్రవారం వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడనున్నాయి. చైత్ర శుద్ధ నవమి రోజైన 27-03-2026 శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారు ఈరోజు భీమేశ్వర సదన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగాక్యూలైన్లు చలి వేంద్రాలు, పందిళ్లు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ అన్న ప్రసాదం పంపిణీ భారీ ప్రవేశ ద్వారాలు (గేట్లు) విద్యుత్ దీపాల అలంకరణ కూలర్లు కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో అలంకరణ తో పాటు హెల్త్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్ సదుపాయం, ప్రత్యేక బస్సులు, సేవా సమితుల సహకారం, పారిశుభ్రత ఏర్పాట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి మాట్లాడుతూ, శ్రీరామనవమి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ : ఈనెల 23న తై బజార్ వేలంపాట, బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.1
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు కొందరు జమ్మికుంట శివారులో సమావేశమయ్యారు. డిన్నర్ తో కలిసిన ఐదుమండలాల నాయకులు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సుదీర్గంగా చర్చించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులం అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా కుటుంబసభ్యులతో కలిసి ప్యాషన్ షోలా తిరుగుతున్నాడని ఆందోళన చెందుతున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులం చెప్పేందుకు ప్రయత్నిస్తే చెప్పనివ్వకుండా నీకేం తెల్వదన్నట్లు వ్యవహరిస్తాడట. నాయకులకు సర్పంచ్, ఎంపిటీసి పదవులు తప్ప మండల జిల్లా స్థాయి పదవులు ఉండొద్దనే దోరణితో ఎమ్మెల్యే ఉన్నాడని ఆవేధన చెందుతున్నారు. ఎవరైనా ఎదురుమాట్లాడితే రౌడీషీట్ ఓపెన్ చేయుమని చెప్పే నాయకుడితో ఇక వేగలేం అంటున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.3