డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు రాఖీలు కట్టిన చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర విజయనగరం, ఆగస్టు 27: రాఖీ పండుగను పురస్కరించుకుని విజయనగరం పేర్లవారి వీధిలోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులతో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ఆత్మీయంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పాఠశాలకు వెళ్లిన సిరి సహస్ర విద్యార్థులకు రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సైతం సిరమ్మకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సోదరభావం, ఆప్యాయత, పరస్పర సహకారం వంటి విలువలను రాఖీ పండుగ చాటిచెబుతుందని సిరి సహస్ర పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో పండుగలను కలిసి జరుపుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు రాఖీలు కట్టిన చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర విజయనగరం, ఆగస్టు 27: రాఖీ పండుగను పురస్కరించుకుని విజయనగరం పేర్లవారి వీధిలోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులతో చిన్న శ్రీను సోల్జర్స్
అధ్యక్షురాలు సిరి సహస్ర ఆత్మీయంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పాఠశాలకు వెళ్లిన సిరి సహస్ర విద్యార్థులకు రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై రాఖీ పండుగ
శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సైతం సిరమ్మకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సోదరభావం, ఆప్యాయత, పరస్పర సహకారం వంటి విలువలను రాఖీ పండుగ చాటిచెబుతుందని సిరి సహస్ర పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో పండుగలను
కలిసి జరుపుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 II గాజువాక II విశాఖపట్నం శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం1
- సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.3
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.1
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1