పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి తండ్రి బరంపూర్ జన బాంధవులు, ప్రకృతి ప్రేమికులు ముడుపు భూమరెడ్డి పెద్దకర్మ వారి స్వగ్రామంలో నిర్వహించగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ..బరంపూర్ గ్రామ పెద్ద దిక్కు లేకపోవడంతో వారి అంతక్రియలకు బరంపూర్ రహదారులన్నీ వాహనాలతో,జనాలతో నిండిపోయిందన్నారు. క్రీ.శే. ముడుపు భూమరెడ్డి కుమారులు సైతం భూమరెడ్డి బాటలో ఎల్లప్పుడూ ప్రజల్లో సామాన్య వ్యక్తులుగా జీవించడం గొప్ప విషయమన్నారు.60 సంవత్సరాల నుండి బరంపూర్ గ్రామాన్ని ఏకగ్రీవంగా సర్పంచ్ గానే కొనసాగించిన గొప్ప నాయకుడు భూమరెడ్డి ని అన్నారు.
పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి తండ్రి బరంపూర్ జన బాంధవులు, ప్రకృతి ప్రేమికులు ముడుపు భూమరెడ్డి పెద్దకర్మ వారి స్వగ్రామంలో నిర్వహించగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ..బరంపూర్ గ్రామ పెద్ద దిక్కు లేకపోవడంతో వారి అంతక్రియలకు బరంపూర్ రహదారులన్నీ వాహనాలతో,జనాలతో నిండిపోయిందన్నారు. క్రీ.శే. ముడుపు భూమరెడ్డి కుమారులు సైతం భూమరెడ్డి బాటలో ఎల్లప్పుడూ ప్రజల్లో సామాన్య వ్యక్తులుగా జీవించడం గొప్ప విషయమన్నారు.60 సంవత్సరాల నుండి బరంపూర్ గ్రామాన్ని ఏకగ్రీవంగా సర్పంచ్ గానే కొనసాగించిన గొప్ప నాయకుడు భూమరెడ్డి ని అన్నారు.
- ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.1
- జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.1
- కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ముఖ్య అంశాలు: నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।1
- అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.1
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- ఆదిలాబాద్ జిల్లా : గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.1