Shuru
Apke Nagar Ki App…
తంగళ్ళపల్లి మండలం మానేరు బ్రిడ్జి పై కాళేశ్వరం 11వ ప్యాకేజీ ఆర్డీఎం ఎల్ఎం 6 ఎల్ఎం 4 పనులు పూర్తి చేయాలంటూ బిజెపి ఆధ్వర్యంలో రైతులు ధర్నా. తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
Satheesh gangu
తంగళ్ళపల్లి మండలం మానేరు బ్రిడ్జి పై కాళేశ్వరం 11వ ప్యాకేజీ ఆర్డీఎం ఎల్ఎం 6 ఎల్ఎం 4 పనులు పూర్తి చేయాలంటూ బిజెపి ఆధ్వర్యంలో రైతులు ధర్నా. తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం3
- కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో పదో తరగతి విద్యార్థులకు పిట్లం లయన్స్ క్లబ్ బాసటగా నిలిచింది. మండలంలోని చిన్న కొడఫ్గల్, గొద్మేగాం | ప్రభుత్వ పాఠశాలల్లో 10th విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండల కీర్తిని చాటాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ కో-ఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు.1
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.3
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రక్త పరీక్షలు నిర్వహించే చోట భయభ్రాంతులకు గురిచేశాయి. ఆస్పత్రిలో కోతుల బెడద రోజురోజుకు మితిమీరి పోతోందని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే కోతులు ఎప్పుడేం చేస్తాయోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వహకులు, జిల్లా యంత్రాంగం కోతుల బెడద లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1