Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్లలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.
Satheesh gangu
సిరిసిల్లలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.1
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్చత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం లోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు.1