మెదక్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద సుమారు 15 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెంచుతున్నాయని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద సుమారు 15 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల
యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెంచుతున్నాయని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
- బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.1
- దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ 'చలో హైదరాబాద్' ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి చేగుంట, నర్సింగ్ మండలాల ఉపాధ్యాయులు శనివారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.1