దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు

- సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.1
- నందిపేట్ : డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన-ఉచిత వైద్య శిభిరం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా నందిపేట్ రాజానగర్ దుర్గాదేవీ ఆలయం వద్ద మండల వైద్యాధికారి డా. స్వాతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. BP, షుగర్, మలేరియా, డెంగ్యూ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందించారు. వర్షాకాల వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, కార్యదర్శి మహేంద్రతో కలిసి మురికి కాల్వలు పరిశీలించి, టెమోఫోస్ స్ప్రే, ఫాగింగ్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. HEO భాస్కర్, PHN పద్మావతి, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కొండపోచమ్మ సాగర్ కాలువ ద్వారా గోదావరి జలాలు చేరడంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం మాసాయిపేట్ మండల పరిధిలోని హక్కింపేట, కొప్పులపల్లి గ్రామాల శివారులో ఉన్న హల్దీ ప్రాజెక్టు ఈ వర్షాకాలంలో జలకళను సంతరించుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు కొండపోచమ్మ సాగర్ కాలువ ద్వారా గోదావరి జలాలు చేరడంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన హల్దీ కాలువ సుమారు 70 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ మార్గమధ్యంలోని 10 చెక్ డ్యాములను నింపుతోంది. దీంతో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చెరువులు, బావులకు కూడా జీవం పోసినట్లైంది. హల్దీ పరీవాహక ప్రాంతంలోని కుడి, ఎడమ కాలువల ద్వారా నాలుగు మండలాలకు చెందిన పది గ్రామాల్లో దాదాపు 2,900 ఎకరాలకు సాగునీరు అందుతోంది. సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండటంతో రైతులు వరి, కూరగాయలు తదితర పంటల సాగుపై ఆశలు పెట్టుకున్నారు. హల్దీ కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.1
- ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...1
- తడ్కల్ పెద్ద, చిన్న చెరువులలోకి భారీగా వరద SRD: కంగ్టి మండల తడ్కల్ శివారులోని పెద్ద, చిన్న చెరువులలోకి భారీగా వరద నీరు చేరింది.4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరడంతో ఒక్కరోజులోనే చెరువు సగానికి పైగా నిండిందని రైతులు తెలిపారు. వర్షాలు కొనసాగితే అలుగు పారే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువు వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.1
- మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన ఈనెల పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండా ను ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల తో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించు కోవడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు 20 లక్షల రూపాయలను కేటాయించుకోవడం జరిగిందని పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్ప్రేయింగ్ మెషిన్ల కొనుగోలు కు దోమల నివారణకై కెమికల్స్ కొనుగోలుకు ఫాగింగ్ మిషన్ల మరమ్మతులకు విధి నిర్వహణలో భాగంగా పారిశుధ్య కార్మికులకు తప్పనిసరి అయిన హ్యాండ్ గ్లౌస్ కొనుగోలు చేయుటకు నిధులను కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్ బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టణ అభివృద్ధి ధ్యేయంగా 24 అంశాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ ఫాషా ,వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు .2
- జలకళతో మెరిసిన ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు.. ప్రకృతి అందాలకు సందర్శకుల వెల్లువ మెదక్ జిల్లాలోని ఘణపురం ఆనకట్ట వద్ద ఉన్న ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు వరుస వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారిన జలాశయం, చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అందాలను ఆస్వాదించేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.1
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.1