Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.
అబ్దుల్ ముసవ్విర్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.
More news from తెలంగాణ and nearby areas
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.1
- రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.1
- కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక! జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.1
- వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.1