మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన ఈనెల పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండా ను ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల తో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించు కోవడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు 20 లక్షల రూపాయలను కేటాయించుకోవడం జరిగిందని పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్ప్రేయింగ్ మెషిన్ల కొనుగోలు కు దోమల నివారణకై కెమికల్స్ కొనుగోలుకు ఫాగింగ్ మిషన్ల మరమ్మతులకు విధి నిర్వహణలో భాగంగా పారిశుధ్య కార్మికులకు తప్పనిసరి అయిన హ్యాండ్ గ్లౌస్ కొనుగోలు చేయుటకు నిధులను కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్ బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టణ అభివృద్ధి ధ్యేయంగా 24 అంశాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ ఫాషా ,వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు .
మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన ఈనెల పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండా ను ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల తో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించు కోవడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు
20 లక్షల రూపాయలను కేటాయించుకోవడం జరిగిందని పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్ప్రేయింగ్ మెషిన్ల కొనుగోలు కు దోమల నివారణకై కెమికల్స్ కొనుగోలుకు ఫాగింగ్ మిషన్ల మరమ్మతులకు విధి నిర్వహణలో భాగంగా పారిశుధ్య కార్మికులకు తప్పనిసరి అయిన హ్యాండ్ గ్లౌస్ కొనుగోలు చేయుటకు నిధులను కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్ బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టణ అభివృద్ధి ధ్యేయంగా 24 అంశాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ ఫాషా ,వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు .
- రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.1
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- 22వ డివిజన్‌లో మహాశక్తి స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వినియోగాన్ని ప్రోత్సహించాలి – మేయర్ కరీంనగర్ నగరంలోని 22వ డివిజన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన *మహాశక్తి స్టీల్ బ్యాంక్* ను నగర మేయర్ *కొలగాని శ్రీనివాస్* ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, అందువల్ల ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ పాత్రలను వినియోగించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు మహాశక్తి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 22వ డివిజన్‌లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రల వినియోగాన్ని పూర్తిగా నివారించే ఉద్దేశంతో *1000 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులతో కూడిన స్టీల్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని* తెలిపారు. ఈ స్టీల్ పాత్రలను డివిజన్‌లోని ప్రజలకు శుభకార్యాల సందర్భాల్లో ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మేయర్ అన్నారు. నగరంలో స్వచ్ఛతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ *బండ రమణారెడ్డి*, బొడ్ల కృష్ణ, పెద్ది శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, కొండలరావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, రవి, సంతోష్ రెడ్డి, మధు స్థానిక నాయకులు పాల్గొన్నారు.4
- గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు1
- సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.1