logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

6 hrs ago
user_Gaddam Naresh
Gaddam Naresh
Local News Reporter Karimnagar, Telangana•
6 hrs ago

గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

More news from Karimnagar and nearby areas
  • సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పెద్ది సుదర్శన్ రెడ్డి, సొంతూరు నల్లబెల్లి మండలం మహేశ్వరం గ్రామానికి చేరుకున్న అంతిమయాత్ర. మరికాసేపట్లో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
    1
    సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
పెద్ది సుదర్శన్ రెడ్డి, సొంతూరు నల్లబెల్లి మండలం మహేశ్వరం గ్రామానికి చేరుకున్న అంతిమయాత్ర.
మరికాసేపట్లో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    10 hrs ago
  • రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.
    1
    రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం  సేవలను కొనియాడిన ఈవో 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    1
    బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు 
రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    30 min ago
  • సంచలనాత్మకంగా ఇంటి దోపిడీ కేసును చేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్ భగత్‌నగర్‌లోని 80 ఏళ్ల ఎం.డి. అజ్మత్ అలీ ఇంట్లోకి జూలై 21/22న డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను నిర్బంధించి దారిదోపిడీ చేశారు. ప్రధాన సూత్రధారులు: బాధితుడి సొంత అల్లుడు మొహమ్మద్ రాజావుద్దీన్ (A1), మనవడు మొహమ్మద్ అజీమ్ రజా (A2) కలసి ఈ దోపిడీకి ప్లాన్ చేశారు. కుటుంబ, ఆర్థిక వివాదాలు, వ్యాపార నిమిత్తం అడిగిన ₹5 లక్షలు ఇవ్వలేదన్న కక్షతోనే అల్లుడు ఈ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. మీరట్‌లో అరెస్టులు: ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు నిందితులను (A3, A4, A5) అరెస్ట్ చేశాయి. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ₹2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు A1, A2 తమ పాత కేసుల్లో మీరట్ కోర్టులో లొంగిపోగా, వారిని పిటి (PT) వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకురావడానికి పోలీసులు లీగల్ ప్రాసెస్ ప్రారంభించారు.
    2
    సంచలనాత్మకంగా ఇంటి దోపిడీ కేసును చేదించిన కరీంనగర్ పోలీసులు 
కరీంనగర్ భగత్‌నగర్‌లోని 80 ఏళ్ల ఎం.డి. అజ్మత్ అలీ ఇంట్లోకి జూలై 21/22న డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను నిర్బంధించి దారిదోపిడీ చేశారు.
ప్రధాన సూత్రధారులు: బాధితుడి సొంత అల్లుడు మొహమ్మద్ రాజావుద్దీన్ (A1), మనవడు మొహమ్మద్ అజీమ్ రజా (A2) కలసి ఈ దోపిడీకి ప్లాన్ చేశారు.
కుటుంబ, ఆర్థిక వివాదాలు, వ్యాపార నిమిత్తం అడిగిన ₹5 లక్షలు ఇవ్వలేదన్న కక్షతోనే అల్లుడు ఈ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.
మీరట్‌లో అరెస్టులు: ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు నిందితులను (A3, A4, A5) అరెస్ట్ చేశాయి.
అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ₹2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితులు 
A1, A2 తమ పాత కేసుల్లో మీరట్ కోర్టులో లొంగిపోగా, వారిని పిటి (PT) వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకురావడానికి పోలీసులు లీగల్ ప్రాసెస్ ప్రారంభించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా తగ్గుతున్న వరద...15 గేట్ల ఎత్తి 92 వేల క్యూసెక్కులు గోదావరి విడుదల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతుంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి నాలుగు లక్షల క్యూసెక్కుల వరదరాగ ఉదయం వరకు లక్షకు చేరుతుంది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో రాత్రి అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తారు. వరద తగ్గడంతో ఉదయం 15 గేట్ల ద్వారా 92435 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 121354 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 108493 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 18.452 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుండగా సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది. ఇక మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ లకు స్వల్పంగా వరద వచ్చి క్రమంగా తగ్గిపోయింది.
    2
    శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా తగ్గుతున్న వరద...15 గేట్ల ఎత్తి 92 వేల క్యూసెక్కులు గోదావరి విడుదల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతుంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి నాలుగు లక్షల క్యూసెక్కుల వరదరాగ ఉదయం వరకు  లక్షకు చేరుతుంది.  కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో రాత్రి  అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తారు. వరద తగ్గడంతో  ఉదయం 15 గేట్ల ద్వారా 92435 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 121354 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 108493 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 18.452 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు.
ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుండగా  సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది. ఇక మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ లకు స్వల్పంగా వరద వచ్చి క్రమంగా తగ్గిపోయింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
    1
    సిరిసిల్ల మున్సిపల్ లో  అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి.
మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు
సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి  ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక  మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు  కోల్పోయి  ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని  మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • అత్తారింట్లో అల్లుడు చోరీ.. ముగ్గురు అరెస్టు...తండ్రీకొడుకు యుపిలో కోర్టులో లొంగుబాటు. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితులు అల్లుడు మనువడేనని పోలీసులు తేల్చారు. అత్తారింట్లో అల్లుడు చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి వివరాలు వెల్లడించారు. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రజావుద్దిన్ అతని కొడుకు అజీమ్ రజాపై యూపిలో రెండు కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాతకేసుల్లో యూపి లోని మీరట్ కోర్టులో లొంగిపోయారని పిటి వారెంట్ పై కరీంనగర్ కు త్వరలోనే తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64. 98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. చోరీలో ఇంకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఎవరిది ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
    2
    అత్తారింట్లో అల్లుడు చోరీ..
ముగ్గురు అరెస్టు...తండ్రీకొడుకు యుపిలో కోర్టులో లొంగుబాటు.
కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితులు అల్లుడు మనువడేనని పోలీసులు తేల్చారు. అత్తారింట్లో అల్లుడు చోరీ కేసులో ముగ్గురిని  అరెస్టు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి  వివరాలు వెల్లడించారు. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రజావుద్దిన్ అతని కొడుకు అజీమ్ రజాపై యూపిలో రెండు కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాతకేసుల్లో యూపి లోని మీరట్ కోర్టులో లొంగిపోయారని పిటి వారెంట్ పై కరీంనగర్ కు త్వరలోనే  తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64. 98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. చోరీలో ఇంకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఎవరిది ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.