Shuru
Apke Nagar Ki App…
గుంటూరు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ గారు బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ IAS అధికారి అయిన ఆయన జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
Journalist SIDDHU
గుంటూరు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ గారు బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ IAS అధికారి అయిన ఆయన జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ అభివృద్ధికి 9కోట్ల రూపాయలు మంజులైనట్లు మేయర్ మూడ్ గణేష్ తెలిపారు లక్ష్మీదేవి పల్లి,నిమ్మలగూడెం,కోమటపల్లి గ్రామాలలో మౌలిక వసంతలు కల్పనకు ఈ నిధులు వేచినట్లు పేర్కొన్నారు.తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను అని కేవలం 20వ డివిజన్ మాత్రమే కాకుండా కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు1
- నల్లగొండ బ్రేకింగ్: జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.... ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తపరిచారు... ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం.. జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది... లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది... మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది... కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి... "ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు... కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు... రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.. నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి... వాహన యజమానులు జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి... వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హెచ్చరిక చేశారు... మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...1
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.1
- కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.1
- వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపుకు స్పందించిన తిర్మలాపురం గ్రామ ప్రజలు ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు గ్రామంలోకి అనుమతి ఇవ్వబోమని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ ప్రవేశద్వారంలో ప్రత్యేక స్వాగత ఆర్చ్‌ను ఏర్పాటు చేశారు. హెల్మెట్ అవసరాన్ని వివరించే సందేశాలతో రూపొందించిన ఈ స్వాగత ద్వారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ, భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గ్రామాన్ని సందర్శించి, హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను అభినందించారు. తిర్మలాపురం గ్రామప్రజలను, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రోడ్డు భద్రతపై చూపిన చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.1
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో మృతి చెందిన స్రవంతి, ఆమె పిల్లల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించగా ఈ ఘటన జరిగింది. భర్త ప్రవీణ్ ఇంటి ముందే మృతదేహాలను పూడ్చేందుకు స్రవంతి బంధువులు గొయ్యి తవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువురు బంధువుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.5