logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం ఎస్సైగా కొత్తగా బదిలీపై వచ్చిన ఎస్సై మనోజ్ కుమార్ ను సోమవారం బీజేపీ రుద్రూర్ మండల కార్యదర్శి తాటె సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినోద్, సత్యయ్య, గంగారాం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Vishwamber Rao
Vishwamber Rao
Press advisory Banswada, Kamareddy•
1 hr ago
0c05159a-a23b-4323-8ec6-0d9bcae99199

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం ఎస్సైగా కొత్తగా బదిలీపై వచ్చిన ఎస్సై మనోజ్ కుమార్ ను సోమవారం బీజేపీ రుద్రూర్ మండల కార్యదర్శి తాటె సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినోద్, సత్యయ్య, గంగారాం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    1
    నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    1
    రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు.

ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    3
    జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.
    1
    మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    9 hrs ago
  • వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాలు చేయుట ట్రస్ట్ మరియు ఎస్. జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య, అలాగే అక్షరాలు చేయుట ట్రస్ట్ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు కోదండరాం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
    1
    వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాలు చేయుట ట్రస్ట్ మరియు ఎస్. జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య, అలాగే అక్షరాలు చేయుట ట్రస్ట్ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు కోదండరాం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    బొమరాస్‌పేట, వికారాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • చేగుంట మండలం సోమ్లా తండాలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయని, అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని సర్పంచ్ ప్రవళిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ వెంకటప్పరెడ్డి, సదరు గ్రామం నార్సింగ్ మండల పరిధిలో ఉందని చెప్పడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామం ఏ మండలంలో ఉందో కూడా తెలియకపోతే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు విద్యుత్ తీగల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది.
    1
    చేగుంట మండలం సోమ్లా తండాలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయని, అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని సర్పంచ్ ప్రవళిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ వెంకటప్పరెడ్డి, సదరు గ్రామం నార్సింగ్ మండల పరిధిలో ఉందని చెప్పడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గ్రామం ఏ మండలంలో ఉందో కూడా తెలియకపోతే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు విద్యుత్ తీగల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.