👆 *అద్భుత శిల్ప కళకు నిలయం – ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం* హైదరాబాద్ తిరుపతి / ఒంటిమిట్ట,12 మార్చి 2026: కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి. *ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర* పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో, సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తారు. రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు. ఆలయంలోని శాసనాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. అంతరాలయం, రంగమండపం, మహా ప్రాంగణం, గోపురాలు వంటి నిర్మాణాలు ఈ కాలంలో నిర్మితమయ్యాయి. *ఎందరో కవులకు నిలయం ఒంటిమిట్ట* ఒంటిమిట్ట క్షేత్రం ఎన్నో మంది మహాకవులకు ప్రేరణనిచ్చిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. మహాకవి శ్రీ పోతన మాత్యులు ఇక్కడే భావగవతాన్ని తెనిగించినట్లు విశ్వసిస్తారు. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీర శతకం రచించి అంకితం చేశారు. రామభద్రకవి రామాభ్యుదయం రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని అనుగ్రహంతో వరకవిగా ప్రసిద్ధి పొందారు. ఉప్పుగుండూరు వేంకటకవి దశరథరామ శతకం రచించారు. ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణంను రచించారు. తాళ్లపాక అన్నమయ్య శ్రీరాముని మహిమను కీర్తిస్తూ అనేక సంకీర్తనలు ఆలపించారు. *2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం* ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండగా, 2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేపడుతోంది. *శ్రీ సీతారాముల కల్యాణం వైభవం* ప్రతి ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అర్చకులు భగవత్ ప్రార్థనతో ప్రారంభించి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదుపరి వస్త్ర సమర్పణ, మధుపర్కం, మహాసంకల్పం, కన్యాదానం జరుగుతాయి. అనంతరం జీలకర్ర–బెల్లం, మాంగల్యపూజ, అక్షతారోపణం, మాలపరివర్తనం వంటి మంగళకార్యాలు నిర్వహించి వేదాశీర్వాదాలతో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా ముగుస్తుంది. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ అందజేస్తుంది.

- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- Post by Bandi renu1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.4
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.2