దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలు సివిల్ ఇంజనీర్లు: *ఏ.సి.సి.ఈ(ఐ)* జాతీయ కార్యదర్శి కాశీ రామ్. **చట్ట రూపంలో సివిల్ ఇంజనీర్ల బిల్లు తీసుకురావాలి** దేశంలో *ఏ.సి.సి.ఈ(ఐ)* కాకినాడ శాఖ ప్రగతి ఐక్యత భేష్. కాకినాడ ఆగస్టు 27 దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైనా సివిల్ ఇంజనీర్ల అభివృద్ధికి కృషి చేయడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ఎసిసిఐ ప్రధాన లక్ష్యమని జాతీయ సెక్రెటరీ జనరల్ ఏ.కాశీరామ్( బెంగళూరు) అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) కాకినాడ చాప్టర్ 6వ వార్షికోత్సవ సమావేశం మరియు అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సెవెన్ స్కా హోటల్లో కాకినాడ సెంటర్ అధ్యక్షులు ఇంజనీర్ ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న కాశీరామ్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ బాదం సుందర్రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల్ చేశారు. అనంతరం సభ్యు లను ఉద్దేశించి కాశీ రామ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ పని జరగదని అటువంటి వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలు పైనే ఉంటుందని ఆయన అన్నారు. సమాజంలో సివిల్ ఇంజనీర్ గౌరవంగా తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు చట్టం ద్వారా సంక్రమించే హక్కులు రక్షణగా ఉంటుందని కాశీ రామ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో ఒరిస్సా ,కర్ణాటక గుజరాత్ రాష్ట్రాలలో సివిల్ ఇంజనీర్ల చట్టం ఆయా ప్రభుత్వాలు అమలులోకి తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పుదుచ్చేరి మరియు తెలంగాణ రాష్ట్రాలలో కూడా త్వరలో చట్టం రావడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వంటి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో సివిల్ ఇంజనీర్లకు సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన సూచన చేశారు. దేశవ్యాప్తంగా 54 ఎసిసిఐ సెంటర్లు ఉన్నాయని అందులో సుమారు పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారని ఆయన చెప్పారు .కాకినాడ సెంటర్ ఐకమత్యంతో తమ బాధ్యతలను నెరవేరుస్తూ సమాజాభివృద్ధికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరిస్తుందని ఆయన కొనియాడారు. కేవలం కాకినాడ సెంటర్ ప్రారంభించి ఆరు సంవత్సరాల కాలంలో 11 జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఘనత మరియు ఐక్యత ప్రశంసనీయమని కాశి రామ్ అన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో పూణే కు చెందిన ఏసీసీఐ సభ్యునికి అవకాశం కల్పించడం గొప్ప విషయం గా ఆయన ప్రస్తావించారు. ఇటీవల మదనపల్లిలో ఏ సి సిఈ(ఐ) సెంటర్ ను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తూ ఏ సి సి ఈ(ఐ) సభ్యులకి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో ఏ సి సి ఈ(ఐ) జాతీయ సదస్సు ను నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న సివిల్ ఇంజనీర్ల మధ్య అవగాహన పరస్పర విజ్ఞాన మార్పిడి తోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన సూచించారు. కాకినాడ చాప్టర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందర్రావు మాట్లాడుతూ కొత్తగా వస్తున్న సివిల్ ఇంజనీర్ విద్యార్థిని విద్యార్థులకు ఫీల్డ్ వర్క్ లో అనుభవం సాధించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు .ఆదిత్య ,ప్రగతి మరియు జేఎన్టీయూ కళాశాలలో సివిల్ ఇంజనీర్ విద్యార్థుల కు అవసరమైన ఆధునిక పరిజ్ఞానం నేర్చుకునే విధంగా పరిశ్రమల మరియు నిర్మాణ రంగాలను స్వయంగా వీక్షించే కార్యక్రమాలను చేపట్టామని అది ఎంతో విజయవంతమైందని చెప్పారు . కాకినాడ చాప్టర్ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంలో 25 సమావేశాలు పైగా నిర్వహించి సభ్యులతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుందని చెప్పారు. జాతీయ స్థాయిలో బెస్ట్ సెంటర్ గా కాకినాడను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కన్సల్టింగ్ ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత మరింతగా పెరిగే విధంగా తప్పక కృషి చేస్తామని ఆయన అన్నారు. 30 మందితో ప్రారంభమైన చాప్టర్ నేడు 155 మందికి చేరుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. అవార్డులు స్వీకరించడం మరింత ఉత్సాహంగాను ప్రోత్సాహం కలుగుతోందని ఆయన అన్నారు. సెంటర్ ప్రగతికి సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులతోపాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా గత రెండు సంవత్సరాలు కాలంలో చేపట్టిన వివిధ అంశాలను చాప్టర్ కార్యదర్శి ఇంజనీర్ సాయి వర ప్రసాద్ వివరించగా బ్యాలెన్స్ షీట్ వివరాలను కోశాధికారి నల్లం భాస్కర్ సభకు సమర్పించారు. అనంతరం జాతీయ సెక్రెటరీ జనరల్ కాశీరాం ను ఘనంగా సత్కరించి జ్ఞాపక అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ మురళీకృష్ణ నాయుడు, ఇంజనీర్ అడపా శ్రీనివాస్, ఇంజనీర్ శివరామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు, డాక్టర్ సరోజరాణి కె ,ఇంజనీర్ గోవింద రాజన్, తో పాటు ఏ సి సి ఈ(ఐ) సభ్యులు మరియు ప్రస్తుత క్రెడయ్ కాకినాడ చాప్టర్ చైర్మన్ ఇంజనీర్ విజయ్ కృష్ణ అధ్యక్షులు ఇంజనీర్ చక్రధర్ రావు ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు ఉపాధ్యక్షులు ఇంజనీర్ ఎస్ఎస్ బలరాం ,ఇంజనీర్ స్వప్న సౌదా చంద్రశేఖర్, ఇంజనీర్ దేవత శేఖర్ కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ ఏవీఎస్ రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు డా. కోకా నరసింహారావు, డా. బి . రామమోహనరావు మరియు లక్ష్మణ రెడ్డి , ఆదిత్య, పి వేణుగోపాలరావు, యూనివర్సిటీ, మెంబెర్షిప్ పెంపుకు సహాయ సహకారాలు అందించిన డా.దయాకర్ బాబు ను ఘనంగ సన్మానించారు. కాకినాడ సెంటర్ కృషికి అభినందనలు తెలుపుతూ సివిల్ ఇంజనీర్స్ ఉపేష్ తన వంతు గా రూ.50 వేలు అస్సోసిషన్ కు బహుకరించారు. అసోసియేషన్ లో కొత్తగా చేరిన 50 మంది సబ్యులకు మేమేబెర్షిప్స్ తాలూకు పత్రాలను అందజేశారు అల్ట్రాటెక్ మరియు జిందాల్ పాంథర్ సహకారం తో సదస్సు నిర్వహించబడింది ఇందులో తుని, అమలాపురం రాజమండ్రి సివిల్ ఇంజినీర్లు కుడా పాల్గొన్నారు.
దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలు సివిల్ ఇంజనీర్లు: *ఏ.సి.సి.ఈ(ఐ)* జాతీయ కార్యదర్శి కాశీ రామ్. **చట్ట రూపంలో సివిల్ ఇంజనీర్ల బిల్లు తీసుకురావాలి** దేశంలో *ఏ.సి.సి.ఈ(ఐ)* కాకినాడ శాఖ ప్రగతి ఐక్యత భేష్. కాకినాడ ఆగస్టు 27 దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైనా సివిల్ ఇంజనీర్ల అభివృద్ధికి కృషి చేయడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ఎసిసిఐ ప్రధాన లక్ష్యమని జాతీయ సెక్రెటరీ జనరల్ ఏ.కాశీరామ్( బెంగళూరు) అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) కాకినాడ చాప్టర్ 6వ వార్షికోత్సవ సమావేశం మరియు అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సెవెన్ స్కా హోటల్లో కాకినాడ సెంటర్ అధ్యక్షులు ఇంజనీర్ ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న కాశీరామ్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ బాదం సుందర్రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల్ చేశారు. అనంతరం సభ్యు లను ఉద్దేశించి కాశీ రామ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ పని జరగదని అటువంటి వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలు పైనే ఉంటుందని ఆయన అన్నారు. సమాజంలో సివిల్ ఇంజనీర్ గౌరవంగా తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు చట్టం ద్వారా సంక్రమించే హక్కులు రక్షణగా ఉంటుందని కాశీ రామ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో ఒరిస్సా ,కర్ణాటక గుజరాత్ రాష్ట్రాలలో సివిల్ ఇంజనీర్ల చట్టం ఆయా ప్రభుత్వాలు అమలులోకి తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పుదుచ్చేరి మరియు తెలంగాణ రాష్ట్రాలలో కూడా త్వరలో చట్టం రావడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వంటి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో సివిల్ ఇంజనీర్లకు సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన సూచన చేశారు. దేశవ్యాప్తంగా 54 ఎసిసిఐ సెంటర్లు ఉన్నాయని అందులో సుమారు పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారని ఆయన చెప్పారు .కాకినాడ సెంటర్ ఐకమత్యంతో తమ బాధ్యతలను నెరవేరుస్తూ సమాజాభివృద్ధికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరిస్తుందని ఆయన కొనియాడారు. కేవలం కాకినాడ సెంటర్ ప్రారంభించి ఆరు సంవత్సరాల కాలంలో 11 జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఘనత మరియు ఐక్యత ప్రశంసనీయమని కాశి రామ్ అన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో పూణే కు చెందిన ఏసీసీఐ సభ్యునికి అవకాశం కల్పించడం గొప్ప విషయం గా ఆయన ప్రస్తావించారు. ఇటీవల మదనపల్లిలో ఏ సి సిఈ(ఐ) సెంటర్ ను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తూ ఏ సి సి ఈ(ఐ) సభ్యులకి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో ఏ సి సి ఈ(ఐ) జాతీయ సదస్సు ను నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న సివిల్ ఇంజనీర్ల మధ్య అవగాహన పరస్పర విజ్ఞాన మార్పిడి తోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన సూచించారు. కాకినాడ
చాప్టర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందర్రావు మాట్లాడుతూ కొత్తగా వస్తున్న సివిల్ ఇంజనీర్ విద్యార్థిని విద్యార్థులకు ఫీల్డ్ వర్క్ లో అనుభవం సాధించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు .ఆదిత్య ,ప్రగతి మరియు జేఎన్టీయూ కళాశాలలో సివిల్ ఇంజనీర్ విద్యార్థుల కు అవసరమైన ఆధునిక పరిజ్ఞానం నేర్చుకునే విధంగా పరిశ్రమల మరియు నిర్మాణ రంగాలను స్వయంగా వీక్షించే కార్యక్రమాలను చేపట్టామని అది ఎంతో విజయవంతమైందని చెప్పారు . కాకినాడ చాప్టర్ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంలో 25 సమావేశాలు పైగా నిర్వహించి సభ్యులతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుందని చెప్పారు. జాతీయ స్థాయిలో బెస్ట్ సెంటర్ గా కాకినాడను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కన్సల్టింగ్ ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత మరింతగా పెరిగే విధంగా తప్పక కృషి చేస్తామని ఆయన అన్నారు. 30 మందితో ప్రారంభమైన చాప్టర్ నేడు 155 మందికి చేరుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. అవార్డులు స్వీకరించడం మరింత ఉత్సాహంగాను ప్రోత్సాహం కలుగుతోందని ఆయన అన్నారు. సెంటర్ ప్రగతికి సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులతోపాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా గత రెండు సంవత్సరాలు కాలంలో చేపట్టిన వివిధ అంశాలను చాప్టర్ కార్యదర్శి ఇంజనీర్ సాయి వర ప్రసాద్ వివరించగా బ్యాలెన్స్ షీట్ వివరాలను కోశాధికారి నల్లం భాస్కర్ సభకు సమర్పించారు. అనంతరం జాతీయ సెక్రెటరీ జనరల్ కాశీరాం ను ఘనంగా సత్కరించి జ్ఞాపక అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ మురళీకృష్ణ నాయుడు, ఇంజనీర్ అడపా శ్రీనివాస్, ఇంజనీర్ శివరామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు, డాక్టర్ సరోజరాణి కె ,ఇంజనీర్ గోవింద రాజన్, తో పాటు ఏ సి సి ఈ(ఐ) సభ్యులు మరియు ప్రస్తుత క్రెడయ్ కాకినాడ చాప్టర్ చైర్మన్ ఇంజనీర్ విజయ్ కృష్ణ అధ్యక్షులు ఇంజనీర్ చక్రధర్ రావు ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు ఉపాధ్యక్షులు ఇంజనీర్ ఎస్ఎస్ బలరాం ,ఇంజనీర్ స్వప్న సౌదా చంద్రశేఖర్, ఇంజనీర్ దేవత శేఖర్ కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ ఏవీఎస్ రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు డా. కోకా నరసింహారావు, డా. బి . రామమోహనరావు మరియు లక్ష్మణ రెడ్డి , ఆదిత్య, పి వేణుగోపాలరావు, యూనివర్సిటీ, మెంబెర్షిప్ పెంపుకు సహాయ సహకారాలు అందించిన డా.దయాకర్ బాబు ను ఘనంగ సన్మానించారు. కాకినాడ సెంటర్ కృషికి అభినందనలు తెలుపుతూ సివిల్ ఇంజనీర్స్ ఉపేష్ తన వంతు గా రూ.50 వేలు అస్సోసిషన్ కు బహుకరించారు. అసోసియేషన్ లో కొత్తగా చేరిన 50 మంది సబ్యులకు మేమేబెర్షిప్స్ తాలూకు పత్రాలను అందజేశారు అల్ట్రాటెక్ మరియు జిందాల్ పాంథర్ సహకారం తో సదస్సు నిర్వహించబడింది ఇందులో తుని, అమలాపురం రాజమండ్రి సివిల్ ఇంజినీర్లు కుడా పాల్గొన్నారు.
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.3
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.1