ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ
లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
- ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.2
- అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.1
- బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఎర్రవరం జలపాతం సందర్శకుల సందడి.. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జలపాతం నుంచి వెదజల్లే చల్లటి పొగమంచు సందర్శకులకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పంచుతోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా జలపాతం వద్దకు చేరుకొని సేదతీరుతున్నారు. ప్రకృతి సోయగాల నడుమ యువత సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచుతున్న ఈ జలపాతానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు1
- 'అట్టహాసంగా జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాపన' తెలుగుదేశం పార్టీని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దేవాలయమే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం రూరల్ మండలం అయ్యన్నపేట సమీపంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే... గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే నినాదంతో పాలిస్తూ పార్టీని ప్రజలకు దగ్గర చేశారని కొనియాడారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల ధీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే పాలన చేసిందన్నారు.2
- 'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం' సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.1