భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.

- : మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ..దమ్మపేట సర్పంచ్ వినూత్న కార్యక్రమం మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ..దమ్మపేట సర్పంచ్ వినూత్న కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ పరిరక్షణకు సర్పంచ్ రమాదేవి రాంబాబు పిలుపునిచ్చారు.దమ్మపేట పంచాయతీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ లో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకుని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో గ్రామ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. POP విగ్రహాల వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయి. అందుకే పర్యావరణ హితమైన మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ సహకరించి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్: 🚨 హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- దేవదేవునికి సతీసమేతంగా 15 సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పొందటం నువ్వు చేసుకున్న పుణ్యం🙏🙏అలాంటి నీకు ప్రాణమిచ్చే సైనికులుగా మమ్మల్ని పుట్టించిన ఆ శ్రీవారికి ఏమి చేయగలం,ఇవ్వగలం,భక్తితో సాష్టాంగ ప్రణామం చేయటం తప్ప🙏🙏....1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1