logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి...త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కాంగ్రెస్ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి...త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో

పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.
    1
    ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన  గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి  వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు  ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    58 min ago
  • పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    1
    పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు.
3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు.
పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు.
జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    1
    ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    user_ధర్మారం వార్తలు
    ధర్మారం వార్తలు
    Insurance Agent ధర్మారం, పెద్దపల్లి, తెలంగాణ•
    9 hrs ago
  • ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    1
    ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ  మన జిల్లాలో  03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై  ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    23 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో వ్యవసాయ భావి పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కూలీలపై క్రేన్ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో సుఖినే దేవరావు(48) బండారి అభిలాష్(16) పైడి(53) ముగ్గురు మరణించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    1
    తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో వ్యవసాయ భావి పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కూలీలపై క్రేన్ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో సుఖినే దేవరావు(48) బండారి అభిలాష్(16) పైడి(53) ముగ్గురు మరణించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    user_Gautham
    Gautham
    Local News Reporter హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    1 hr ago
  • గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
    1
    గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
    6
    ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  పాల్గొన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    23 hrs ago
  • గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    2
    గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.