మరో మారు మోగనున్న ఎన్నికల నగారా? *త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?* * ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. స్పష్టత ఇచ్చే అవకాశం * ఒకే విడతలో పోలింగ్.. 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు * బడ్జెట్ సెషన్స్, పరీక్షల షెడ్యూల్‌కు తగ్గట్టుగా నిర్ణయం! రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మున్సిపల్ ఎన్నికల జోష్‌తో అత్యంత వేగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించేలా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనివల్ల యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా, త్వరగా పాలనపై దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. *ఎన్నికల నిర్వహణపై చర్చ* రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమాలోచన చేయనున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా? లేదా? పరీక్షల తర్వాత అనేది ఖరారు కానున్నది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్అయ్యాయి. అదే సమయంలో మార్చి రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 538 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలన్నీ అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు పెండింగ్‌లో ఉన్న 500 కోట్ల రూపాయలపైన 15 వ ఆర్థిక సంఘం నిధులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది....

- *నకిరేకల్ నియోజకవర్గం* *రామన్నపేట మండలం* ఈరోజు రామన్నపేట మండలం *తుర్కపల్లి* గ్రామానికి చెందిన *సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త* *దొడ్డి మారయ్య* గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించి దహన సంస్కారాలకు *ఐదువేల* *రూపాయలు* *(5000/_)* ఆర్థిక సాయం అందజేసిన దైద రవీందర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి ఉప సర్పంచ్ మల్లయ్య జే వెంకన్న ప్రశాంత్ జానయ్య సూరయ్య యాదగిరి శంకర్ వెంకట చారి సాలయ్య నర్సింహ కృష్ణయ్య కుమార్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- హన్మకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 132 మంది లబ్ధిదారులకు రూ.1,34,15,544 విలువైన చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హతే ప్రమాణంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.2
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.1
- మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం3
- వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు బాలికల జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా నల్గొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు బోనగిరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.2