logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైడబ్ల్యూసీఎస్ సొసైటీ ఆప్కో మార్కెటింగ్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు: ప్రజా సంఘాలు చేనేతల అభివృద్ధిని అడ్డుకునే తప్పుడు ప్రచారంపై మండిపాటు... ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైడబ్ల్యూసీఎస్ చేనేతల సహకార సంఘం ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేపట్టిన నిర్ణయానికి ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ నాయకుడు రంగయ్య మాట్లాడుతూ, ఈ నిర్ణయంపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు. సొసైటీని ఆప్కోకు అంకితం చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసి చేనేతలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ వేగవంతం కోసం ఆప్కో వేదికను వినియోగించడం చేనేతలకు మేలు చేస్తుందని, దానిని మోసం గా చిత్రీకరించడం తగదని అన్నారు. ఆప్కో ద్వారా నేత వస్త్రాల విక్రయం పెరిగి, ఎగుమతులు విస్తరించి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మన నేతన్న వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించడానికి లేక, చేనేతలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి కక్షసాధింపుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. చేనేతలు ఈ తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆప్కోలో విలీనం అంటే కేవలం ఆప్కో మార్కెట్ వ్యవస్థను ఉపయోగించి నేత వస్త్రాల అమ్మకాలు పెంచడం మాత్రమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతలను మోసం చేయాలనుకుంటే ఎమ్మిగనూరుకు వందల కోట్లతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరిగేదా, ఉచిత విద్యుత్ వంటి ఆర్థిక సహాయాలు అందించేదా అని ప్రశ్నించారు. టెక్స్టైల్ పార్క్ పనులు శరవేగంగా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక వైసీపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. పద్మశ్రీ సోమప్ప గారి పేరు తుడిచివేయాలనే ఆరోపణలను ఖండిస్తూ, ఆయన పేరు చేనేతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచివుంటుందని అన్నారు. ఇక గతంలో నాగలదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన బుట్టా రేణుకమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. చేనేతల ఉపాధి, ఉత్పత్తి, మార్కెటింగ్ అభివృద్ధి కోసం ఆప్కోతో తీసుకున్న నిర్ణయం సరైనదని, ప్రజా సంఘాల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రంగయ్య స్పష్టం చేశారు.

4 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
4dbf69f3-93ea-4728-8cd8-0aef7ca82922

వైడబ్ల్యూసీఎస్ సొసైటీ ఆప్కో మార్కెటింగ్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు: ప్రజా సంఘాలు చేనేతల అభివృద్ధిని అడ్డుకునే తప్పుడు ప్రచారంపై మండిపాటు... ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైడబ్ల్యూసీఎస్ చేనేతల సహకార సంఘం ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేపట్టిన నిర్ణయానికి ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ నాయకుడు రంగయ్య మాట్లాడుతూ, ఈ నిర్ణయంపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు. సొసైటీని ఆప్కోకు అంకితం చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసి చేనేతలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ వేగవంతం కోసం ఆప్కో వేదికను వినియోగించడం చేనేతలకు మేలు చేస్తుందని, దానిని మోసం గా చిత్రీకరించడం తగదని అన్నారు. ఆప్కో ద్వారా నేత వస్త్రాల విక్రయం పెరిగి, ఎగుమతులు విస్తరించి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మన నేతన్న వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించడానికి లేక, చేనేతలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి కక్షసాధింపుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. చేనేతలు ఈ తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆప్కోలో విలీనం అంటే కేవలం ఆప్కో మార్కెట్ వ్యవస్థను ఉపయోగించి నేత వస్త్రాల అమ్మకాలు పెంచడం మాత్రమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతలను మోసం చేయాలనుకుంటే ఎమ్మిగనూరుకు వందల కోట్లతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరిగేదా, ఉచిత విద్యుత్ వంటి ఆర్థిక సహాయాలు అందించేదా అని ప్రశ్నించారు. టెక్స్టైల్ పార్క్ పనులు శరవేగంగా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక వైసీపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. పద్మశ్రీ సోమప్ప గారి పేరు తుడిచివేయాలనే ఆరోపణలను ఖండిస్తూ, ఆయన పేరు చేనేతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచివుంటుందని అన్నారు. ఇక గతంలో నాగలదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన బుట్టా రేణుకమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. చేనేతల ఉపాధి, ఉత్పత్తి, మార్కెటింగ్ అభివృద్ధి కోసం ఆప్కోతో తీసుకున్న నిర్ణయం సరైనదని, ప్రజా సంఘాల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రంగయ్య స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది…
పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు…
ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు…
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు.
అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    1
    ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం  వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    11 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    41 min ago
  • ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    1
    ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం
కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే
ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి
P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం
సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం
ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం
క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం
అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.