logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాపిడో ఆటోలో మర్చిపోయిన నగల బ్యాగు.. చాకచక్యంగా గుర్తించిన కుషాయిగూడ పోలీసులు హెచ్‌బీ కాలనీ ఇంద్రానగర్‌కు చెందిన ఓ మహిళ గోధుమకుంట, కీసరకు ఫంక్షన్‌కు వెళ్లేందుకు రాపిడో ఆటోలో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. బ్యాగులో 2 తులాల బంగారు ఉంగరాలు, 10 తులాల వెండి పట్టీలు ఉన్నాయి. విషయం గుర్తించిన మహిళ, రాపిడో బుకింగ్‌లో ఉన్న ఆటో నంబర్ ఆధారంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఆటోను ట్రేస్ చేసి, డ్రైవర్‌ను పిలిపించారు. బ్యాగుతో పాటు అందులో ఉన్న నగలను సురక్షితంగా స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ మహేష్‌లను క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు అభినందించారు.

1 hr ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
1 hr ago
e764dc7d-b770-445f-80ce-3005cc5bd8e6

రాపిడో ఆటోలో మర్చిపోయిన నగల బ్యాగు.. చాకచక్యంగా గుర్తించిన కుషాయిగూడ పోలీసులు హెచ్‌బీ కాలనీ ఇంద్రానగర్‌కు చెందిన ఓ మహిళ గోధుమకుంట, కీసరకు ఫంక్షన్‌కు వెళ్లేందుకు రాపిడో ఆటోలో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. బ్యాగులో 2 తులాల బంగారు ఉంగరాలు, 10 తులాల వెండి పట్టీలు ఉన్నాయి. విషయం గుర్తించిన మహిళ, రాపిడో బుకింగ్‌లో ఉన్న ఆటో నంబర్ ఆధారంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఆటోను ట్రేస్ చేసి, డ్రైవర్‌ను పిలిపించారు. బ్యాగుతో పాటు అందులో ఉన్న నగలను సురక్షితంగా స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ మహేష్‌లను క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు
    1
    రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం
రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది.
ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.
    3
    అక్క కోసం 10అడుగుల రాఖీ  చిత్రించి అంకితం ఇచ్చిన

తమ్ముడు రామకోటి రామరాజు

అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ
అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్‌ దొంత నరేందర్‌ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
    1
    ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్‌ దొంత నరేందర్‌ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల డా. వెంకట్ యాదవ్ శ్రీనివాస్ కొప్పునమోని శ్రీనివాస్ మెంగా సుజాత రాథోడ్ దేవిక రొక్కం బత్తిని సుదర్శన్ గౌడ్ డా. రవికుమార్ ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻
    1
    హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ
హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన
తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ:
🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి
🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి
🔴 OPSను పునరుద్ధరించాలి
🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి
🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం
ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
డా. కిరణ్ మాదాల 
డా. వెంకట్ యాదవ్ 
శ్రీనివాస్ కొప్పునమోని 
శ్రీనివాస్ మెంగా 
సుజాత రాథోడ్ 
దేవిక రొక్కం 
బత్తిని సుదర్శన్ గౌడ్ 
డా. రవికుమార్ 
✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • 22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
    1
    22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్
మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • రాందాస్‌ చౌరస్తా వద్ద ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం ఆందోళన విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం నాయకులు గురువారం నిరసనకు దిగారు. రాందాస్‌ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్‌ మల్లేశంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌తో పాటు పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    రాందాస్‌ చౌరస్తా వద్ద ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం ఆందోళన
విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం నాయకులు గురువారం నిరసనకు దిగారు. రాందాస్‌ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్‌ మల్లేశంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌తో పాటు పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    1
    వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. 
ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం 
వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో
మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో
హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా
వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర 
గాయాలు కావడంతో 
ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా 
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    4
    యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.