Shuru
Apke Nagar Ki App…
ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Sraya
ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1
- రాందాస్ చౌరస్తా వద్ద ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం ఆందోళన విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు గురువారం నిరసనకు దిగారు. రాందాస్ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేశంగౌడ్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌తో పాటు పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1