యువత సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాలి* జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ యువత సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం నాడు వేంసూర్ రోడ్ లో గల జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కోమటి తిరుమలరావు అధ్యక్షతన 5 మండలాల యువత తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని యువతని ఉద్దేశించి మాట్లాడారు*. నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఈ సమాజంలో దేన్నైనా సాధించే శక్తి మీకు ఉందని, కాబట్టి అటువంటి యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా విద్య, ఉద్యోగ ,రాజకీయ, వ్యాపార రంగాల్లో తనదైన పాత్ర పోషించాలని తెలిపారు. ముఖ్యంగా బీసీ యువత బీసీల అణిచివేతను వ్యతిరేకిస్తూ న్యాయబద్ధమైన బీసీ హక్కులకై పోరాటాలు జరపాలని పిలుపునిచ్చారు. బీసీల రాజ్యాధికార ఉద్యమంలో యువత పాత్ర కీలకం కావాలని విజ్ఞప్తి చేశారు. *అనంతరం* నియోజకవర్గంలోని వివిధ మండలాల యువతకు బాధ్యతలు అప్పగించారు. ముందుగా సత్తుపల్లి పట్టణ అధ్యక్షులుగా వేముల వెంకటేశ్వరరావు, యువజన సంఘం వేంసూర్ మండల అధ్యక్షులుగా మిట్టపల్లి శ్రీనాథ్ భార్గవ్, ➡️యువజన సంఘం పెనుబల్లి మండల అధ్యక్షులుగా రాయల శ్రావణ్ కుమార్, యువజన సంఘం కల్లూరు అధ్యక్షులుగా కొండపల్లి మురళీకృష్ణ లకు జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. *ఈ కార్యక్రమంలో *జాతీయ బిసి సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, బీసీ సంఘం సీనియర్ నాయకులు డాక్టర్ పెద్దిరాజు, యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకురి మరేశ్వరరావు తో పాటుగా పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు

- Post by V Ramarao1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- Post by Veesachandu1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- Post by V Ramarao4