భవాని నగర్ సమస్యలపై ప్రభాకర్ పరిశీలన..ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్.. డివిజన్‌లోని భవాని నగర్ కాలనీలో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ స్పందించారు. సమస్యలపై స్థానికులు దూరవాణి ద్వారా ఆయనకు సమాచారం అందించడంతో వెంటనే కాలనీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సంబంధిత ఉన్నతాధికారి డీసీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రభాకర్.. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. స్థానికులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చెంచారం వినోద్‌రెడ్డి, చెంచారం కృష్ణారెడ్డి, అనితారెడ్డి, సత్యలక్ష్మి, విజయ, రాజి, సౌమ్య, సరోజ, మంజు, రమ, లక్ష్మి, వనిత, పద్మ, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, మంజులవాణి తదితరులు, స్థానిక మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భవాని నగర్ సమస్యలపై ప్రభాకర్ పరిశీలన..ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్.. డివిజన్‌లోని భవాని నగర్ కాలనీలో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ స్పందించారు. సమస్యలపై స్థానికులు దూరవాణి ద్వారా ఆయనకు సమాచారం అందించడంతో వెంటనే కాలనీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సంబంధిత ఉన్నతాధికారి డీసీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రభాకర్.. సమస్యలను
త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. స్థానికులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చెంచారం వినోద్‌రెడ్డి, చెంచారం కృష్ణారెడ్డి, అనితారెడ్డి, సత్యలక్ష్మి, విజయ, రాజి, సౌమ్య, సరోజ, మంజు, రమ, లక్ష్మి, వనిత, పద్మ, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, మంజులవాణి తదితరులు, స్థానిక మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.1
- నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1