బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
- శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- భువనగిరి: ఫీజు బకాయిలపై బీజేపీ పార్టీ నాయకుల నిరసన.... విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుతో భువనగిరిలో నాయకులు నిరసన చేపట్టారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.1
- భువనగిరి మండల కేంద్రములో యూత్ కాంగ్రెస్ నాయకుల ధర్నా.. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ అధినేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె జహంగీర్, ఆవేస్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.1
- వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని చిన్నశంకరంపేట మండల రైతుల ఆవేదన వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువును సకాలంలో వినియోగించకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మార్కెట్‌కు చేరిన యూరియా కొద్దిసేపటికే పూర్తిగా అయిపోతుండటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను సమృద్ధిగా సరఫరా చేయాలని కోరారు.1
- నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ మమ్మల్నే కారణంగా చూపి నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తున్నారు అంటూ ఆవేదన ఆడ పిల్లలమైన తమపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్న నర్సింగ్ సిబ్బంది1
- కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఢీకొన్న వెంటనే బైకుల్లో ఒకదానికి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో పాటు రైలాపూర్‌కు చెందిన బిక్షపతికి గాయాలయ్యాయి. రోడ్డుపై అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1