Shuru
Apke Nagar Ki App…
వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని చిన్నశంకరంపేట మండల రైతుల ఆవేదన వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువును సకాలంలో వినియోగించకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మార్కెట్‌కు చేరిన యూరియా కొద్దిసేపటికే పూర్తిగా అయిపోతుండటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను సమృద్ధిగా సరఫరా చేయాలని కోరారు.
Sraya
వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని చిన్నశంకరంపేట మండల రైతుల ఆవేదన వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువును సకాలంలో వినియోగించకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మార్కెట్‌కు చేరిన యూరియా కొద్దిసేపటికే పూర్తిగా అయిపోతుండటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను సమృద్ధిగా సరఫరా చేయాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.1
- పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఆగస్టు 29న అమీన్పూర్‌లో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభకు 15 వేల మంది తరలిరానున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న భూములను 22A నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- మెదక్ : వృద్ధురాలి బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ను చేదించిన పోలీసులు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం సాయి నగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలెశెట్టి సులోచన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై క్రైం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. దయారా స్ట్రీట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన చాకలి మొగులయ్య (34) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి చోరీ కి గురైన 4 లక్షల 50 వేల విలువ గల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి పై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన క్రైమ్ టీం నర్సింలు, మల్లేశం ను ఇన్‌స్పెక్టర్ మహేష్ అభినందించారు.1
- కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఢీకొన్న వెంటనే బైకుల్లో ఒకదానికి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో పాటు రైలాపూర్‌కు చెందిన బిక్షపతికి గాయాలయ్యాయి. రోడ్డుపై అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1