logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో జగిత్యాల జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా, జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, 450 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే, జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండానే ప్రమాద బీమా కల్పించిందని, రాష్ట్రంలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మారుమూల మండలమైన బీర్‌పూర్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు, బీర్‌పూర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల మండలాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు సాధించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రాన్ని వైద్య సేవలకు నిలయంగా మార్చడానికి చేస్తున్న కృషికి మంత్రి అడ్లూరితో పాటు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఏడాది లోపలే బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
2 hrs ago

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో జగిత్యాల జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా, జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, 450 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే, జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండానే ప్రమాద బీమా కల్పించిందని, రాష్ట్రంలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మారుమూల మండలమైన బీర్‌పూర్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు, బీర్‌పూర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల మండలాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు సాధించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రాన్ని వైద్య సేవలకు నిలయంగా మార్చడానికి చేస్తున్న కృషికి మంత్రి అడ్లూరితో పాటు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఏడాది లోపలే బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ, 'ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు అవినీతికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతిని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని, ఒకవేళ రుజువు చేయలేకపోతే జీవన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. 2016 నుంచి మంథని ప్రాంతంలో ఇసుక దందాను ఎవరు ప్రారంభించారో ధైర్యం ఉంటే రుజువు చేయాలని, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితులకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను తీసుకొని స్మశాన వాటికల్లో రైతు వేదికలు నిర్మించిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు తండ్రితో పనిచేశానని చెప్పుకుంటూ ఆయనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. శ్రీధర్ బాబు నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసని, జీవన్ రెడ్డి తన గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వామన్ రావు దంపతుల హత్య ఉదంతం, మంథనిలో శాంతిభద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులో జీవన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని, దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని, వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 100 శాతం న్యాయం చేసిందని వివరించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నారని, 'SIR' పేరుతో నియోజకవర్గాల పర్యటనలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. పుట్ట మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అని, నేటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక కాంట్రాక్టర్లను, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి వంత పాడుతూ జీవన్ రెడ్డి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే దానిని చిన్నచూపు చూస్తూ ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, సొంత ఖజానాకు తరలించి, అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోవడానికి కారణం బీఆర్ఎస్ చేసిన అప్పులేనని స్పష్టం చేశారు. గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్‌కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం ఇవ్వడం ప్రజా వంచన అవుతుందా అని ప్రశ్నించారు. బాధ్యతగల మంత్రిగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు గారు ఎంతో శ్రమిస్తున్నారని వెల్లడించారు.
    1
    గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ, 'ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు అవినీతికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతిని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని, ఒకవేళ రుజువు చేయలేకపోతే జీవన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. 2016 నుంచి మంథని ప్రాంతంలో ఇసుక దందాను ఎవరు ప్రారంభించారో ధైర్యం ఉంటే రుజువు చేయాలని, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితులకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను తీసుకొని స్మశాన వాటికల్లో రైతు వేదికలు నిర్మించిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు తండ్రితో పనిచేశానని చెప్పుకుంటూ ఆయనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. శ్రీధర్ బాబు నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసని, జీవన్ రెడ్డి తన గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వామన్ రావు దంపతుల హత్య ఉదంతం, మంథనిలో శాంతిభద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులో జీవన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని, దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని, వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 100 శాతం న్యాయం చేసిందని వివరించారు.

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నారని, 'SIR' పేరుతో నియోజకవర్గాల పర్యటనలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. పుట్ట మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అని, నేటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక కాంట్రాక్టర్లను, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి వంత పాడుతూ జీవన్ రెడ్డి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే దానిని చిన్నచూపు చూస్తూ ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, సొంత ఖజానాకు తరలించి, అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోవడానికి కారణం బీఆర్ఎస్ చేసిన అప్పులేనని స్పష్టం చేశారు. గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్‌కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం ఇవ్వడం ప్రజా వంచన అవుతుందా అని ప్రశ్నించారు. బాధ్యతగల మంత్రిగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు గారు ఎంతో శ్రమిస్తున్నారని వెల్లడించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు మానసా దేవి మరియు అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా, 108 శివలింగాలకు మరియు జంట నాగులకు జలాభిషేకం చేసి, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలంటూ భక్తులు అమ్మవార్లకు ముడుపులు కట్టారు. భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
    1
    గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు మానసా దేవి మరియు అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా, 108 శివలింగాలకు మరియు జంట నాగులకు జలాభిషేకం చేసి, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలంటూ భక్తులు అమ్మవార్లకు ముడుపులు కట్టారు. భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈవో) శ్రీమతి రమాదేవి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్‌ను చేపట్టారు. ఈ డ్రైవ్‌లో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా శుభ్రపరిచారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వర్షాకాలంలో దోమలు, క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయ ఆవరణలో ఉపయోగంలో లేని వస్తువులు, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ మరియు ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ పర్యవేక్షిస్తూ, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ఆలయ వాతావరణం అందుబాటులో ఉండేలా నిరంతరం శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో సానిటేషన్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొని పరిశుభ్రత పనులను నిర్వహించారు. వర్షాకాలం మొత్తం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈవో) శ్రీమతి రమాదేవి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్‌ను చేపట్టారు.

ఈ డ్రైవ్‌లో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా శుభ్రపరిచారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వర్షాకాలంలో దోమలు, క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయ ఆవరణలో ఉపయోగంలో లేని వస్తువులు, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ మరియు ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ పర్యవేక్షిస్తూ, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ఆలయ వాతావరణం అందుబాటులో ఉండేలా నిరంతరం శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో సానిటేషన్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొని పరిశుభ్రత పనులను నిర్వహించారు.

వర్షాకాలం మొత్తం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఒక ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఈవో రమాదేవి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పరిశుభ్రత డ్రైవ్‌లో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా శుభ్రం చేశారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వర్షాకాలంలో దోమలు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. దీనిలో భాగంగా, ఆలయ ఆవరణలోని ఉపయోగంలో లేని వస్తువులు, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ మరియు ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడంతో పాటు, భక్తులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ఆలయ వాతావరణం అందుబాటులో ఉండేలా నిరంతరం శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో సానిటేషన్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొని పరిశుభ్రత పనులను నిర్వహించారు. వర్షాకాలం మొత్తం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఒక ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఈవో రమాదేవి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పరిశుభ్రత డ్రైవ్‌లో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా శుభ్రం చేశారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వర్షాకాలంలో దోమలు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. దీనిలో భాగంగా, ఆలయ ఆవరణలోని ఉపయోగంలో లేని వస్తువులు, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ మరియు ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడంతో పాటు, భక్తులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ఆలయ వాతావరణం అందుబాటులో ఉండేలా నిరంతరం శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో సానిటేషన్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొని పరిశుభ్రత పనులను నిర్వహించారు.

వర్షాకాలం మొత్తం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • ఎల్‌ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు, దీనివల్ల సాగుబడి ముందుకు సాగక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఉపాధి హామీ కూలీలు వర్షాల కోసం వినూత్న పద్ధతిలో వరుణుడిని వేడుకున్నారు. వారు బతుకమ్మ ఆటలతో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని కోరారు. చెరువులు నిండి రైతుల కష్టాలు తీరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    1
    ఎల్‌ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు, దీనివల్ల సాగుబడి ముందుకు సాగక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఉపాధి హామీ కూలీలు వర్షాల కోసం వినూత్న పద్ధతిలో వరుణుడిని వేడుకున్నారు.

వారు బతుకమ్మ ఆటలతో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని కోరారు. చెరువులు నిండి రైతుల కష్టాలు తీరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మొహర్రం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో పీర్ల సంప్రదాయ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఆచారంలో భాగంగా, భక్తులు పీర్లను మూడుసార్లు వంచి తలలు కొట్టే సంప్రదాయాన్ని విశ్వాసంతో పాటించారు. ఈ వేడుకలో పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరై భక్తితో పాల్గొన్నారు. మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ వేడుకను నిర్వహించడం స్థానికంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, భక్తుల రద్దీతో బెజ్జంకి సందడిగా మారింది. ఈ తరహా వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పలువురు పెద్దలు అభిప్రాయపడ్డారు. బెజ్జంకిలో మతసామరస్యాన్ని చాటిన పీర్ల పండుగ సాంప్రదాయ వేడుక ఇది.
    1
    మొహర్రం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో పీర్ల సంప్రదాయ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఆచారంలో భాగంగా, భక్తులు పీర్లను మూడుసార్లు వంచి తలలు కొట్టే సంప్రదాయాన్ని విశ్వాసంతో పాటించారు. ఈ వేడుకలో పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరై భక్తితో పాల్గొన్నారు.

మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ వేడుకను నిర్వహించడం స్థానికంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, భక్తుల రద్దీతో బెజ్జంకి సందడిగా మారింది. ఈ తరహా వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పలువురు పెద్దలు అభిప్రాయపడ్డారు. బెజ్జంకిలో మతసామరస్యాన్ని చాటిన పీర్ల పండుగ సాంప్రదాయ వేడుక ఇది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ మండలంలో ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ వానా కాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులను పూర్తి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో డీపీఆర్ (Detailed Project Report) పూర్తయిన తర్వాతే పనులు చేపడతారని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఎలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 2016లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు. మొదట్లో రూ. 60 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనాలు 2023 డిసెంబర్ నాటికి రూ. 153 కోట్లకు పెరిగినప్పటికీ, నిర్మాణం పూర్తి చేయలేదని మంత్రి మండిపడ్డారు. హరీష్ రావు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నా, ధర్మపురి నియోజకవర్గంలోని ప్రాజెక్టులను మాత్రం పెండింగ్ లో పెట్టారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి లేకుండానే రోళ్ల వాగు ప్రాజెక్టును ప్రారంభించిందని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ల వాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, అన్నదాతలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన రూ. 40 కోట్లు చెల్లించడంతో పాటు, రెవెన్యూకు సంబంధించిన 800 ఎకరాల భూమిని అప్పగించామని ఆయన వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతుల కోసం రూ. 32 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందని, ఈ అనుమతులతో పాటు ఇతర అటవీ శాఖ అనుమతులు సాధించి ఈ వానా కాలంలో రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదిహేను రోజుల్లో ప్రాజెక్టుకు గేట్లు బిగించి, 0.25 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కాల్వ లైనింగ్ పనులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొంటూ, యుద్ధ ప్రాతిపదికన గేట్ల బిగింపు చేపట్టి రైతులకు సాగునీటిని అందించాలని అధికారులను కోరారు.
    1
    జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ మండలంలో ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ వానా కాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులను పూర్తి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో డీపీఆర్ (Detailed Project Report) పూర్తయిన తర్వాతే పనులు చేపడతారని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఎలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 2016లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు. మొదట్లో రూ. 60 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనాలు 2023 డిసెంబర్ నాటికి రూ. 153 కోట్లకు పెరిగినప్పటికీ, నిర్మాణం పూర్తి చేయలేదని మంత్రి మండిపడ్డారు. హరీష్ రావు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నా, ధర్మపురి నియోజకవర్గంలోని ప్రాజెక్టులను మాత్రం పెండింగ్ లో పెట్టారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి లేకుండానే రోళ్ల వాగు ప్రాజెక్టును ప్రారంభించిందని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ల వాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, అన్నదాతలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన రూ. 40 కోట్లు చెల్లించడంతో పాటు, రెవెన్యూకు సంబంధించిన 800 ఎకరాల భూమిని అప్పగించామని ఆయన వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతుల కోసం రూ. 32 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందని, ఈ అనుమతులతో పాటు ఇతర అటవీ శాఖ అనుమతులు సాధించి ఈ వానా కాలంలో రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదిహేను రోజుల్లో ప్రాజెక్టుకు గేట్లు బిగించి, 0.25 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కాల్వ లైనింగ్ పనులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొంటూ, యుద్ధ ప్రాతిపదికన గేట్ల బిగింపు చేపట్టి రైతులకు సాగునీటిని అందించాలని అధికారులను కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ నగరంలోని 66వ డివిజన్, 201వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎస్.ఐ.ఆర్ (SIR) ఇంటింటి సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ) తులసి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2002 ఓటర్ల జాబితా ఆధారంగా మూడు విభాగాలుగా ఎన్యుమరేషన్ ఫారాల నమోదు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుత ఓటర్లతో పాటు, ఓటర్ల జాబితాలో లేని వారి పూర్వీకుల వివరాలను కూడా సేకరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ సర్వేకు ఓటర్లందరూ సానుకూలంగా స్పందించి, పూర్తిస్థాయిలో సహకరించాలని బి.ఎల్.ఓ తులసి విజ్ఞప్తి చేశారు.
    2
    కరీంనగర్ నగరంలోని 66వ డివిజన్, 201వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎస్.ఐ.ఆర్ (SIR) ఇంటింటి సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ) తులసి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2002 ఓటర్ల జాబితా ఆధారంగా మూడు విభాగాలుగా ఎన్యుమరేషన్ ఫారాల నమోదు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుత ఓటర్లతో పాటు, ఓటర్ల జాబితాలో లేని వారి పూర్వీకుల వివరాలను కూడా సేకరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ సర్వేకు ఓటర్లందరూ సానుకూలంగా స్పందించి, పూర్తిస్థాయిలో సహకరించాలని బి.ఎల్.ఓ తులసి విజ్ఞప్తి చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయటపడిన ధాన్యం కుంభకోణం విలువ రూ.91 లక్షలు కాదని, ఇది రూ.3 నుంచి 4 కోట్ల మేర అవినీతి అని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొనరావుపేట మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, రుద్రంగి నాయకులు చెప్యాల గణేష్ ఈ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల ప్రకారం, మల్కపేట గ్రామంలోని ఐకేపీ సెంటర్ ఇంచార్జ్, కాంగ్రెస్ నాయకుడు జంగిటి శ్రీనివాస్ ధాన్యం బస్తాల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన బయటపడగానే రాత్రికి రాత్రే 467 ధాన్యం బస్తాలను సిరిసిల్ల గోదాముకు తరలించే ప్రయత్నం జరిగింది. అయితే, అక్కడికి చేరుకున్న అధికారులు కేవలం రైతులకు చెందిన 378 బస్తాలను మాత్రమే దింపగా, మిగిలిన 89 బస్తాలను లారీలోనే ఉంచారు. గ్రామ సర్పంచ్ బోయిని దేవరాజు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా బయటకు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ధాన్యం కుంభకోణంలో నిందితులైన జంగిటి శ్రీనివాస్, గడ్డం స్వామి అలియాస్ నరసారెడ్డికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సన్నిహిత అనుచరులుగా ఉన్నవారే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కొనరావుపేట మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ప్రస్తుత డీసీసీ ప్రధాన కార్యదర్శి చేపూరి గంగాధర్‌కు చేపూరి మధుకర్ సోదరుడు కాదా అని ప్రశ్నిస్తూ, ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుల పాత్రపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వారు పేర్కొన్నారు. చల్మెడ లక్ష్మీనరసింహారావుపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. దొంగతనానికి సంబంధించిన ధాన్యం బస్తాలు స్వయంగా పట్టుబడినప్పటికీ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ ధాన్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, రుద్రంగి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, కొనరావుపేట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, అంజద్ పాషా, సుంకపాక రాజు, సందీప్, కనకయ్య, పబ్బ మహేష్, ప్రేమ్ చారి, సంజీవ్, ఉప్పులుటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయటపడిన ధాన్యం కుంభకోణం విలువ రూ.91 లక్షలు కాదని, ఇది రూ.3 నుంచి 4 కోట్ల మేర అవినీతి అని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొనరావుపేట మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, రుద్రంగి నాయకులు చెప్యాల గణేష్ ఈ ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ నేతల ఆరోపణల ప్రకారం, మల్కపేట గ్రామంలోని ఐకేపీ సెంటర్ ఇంచార్జ్, కాంగ్రెస్ నాయకుడు జంగిటి శ్రీనివాస్ ధాన్యం బస్తాల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన బయటపడగానే రాత్రికి రాత్రే 467 ధాన్యం బస్తాలను సిరిసిల్ల గోదాముకు తరలించే ప్రయత్నం జరిగింది. అయితే, అక్కడికి చేరుకున్న అధికారులు కేవలం రైతులకు చెందిన 378 బస్తాలను మాత్రమే దింపగా, మిగిలిన 89 బస్తాలను లారీలోనే ఉంచారు. గ్రామ సర్పంచ్ బోయిని దేవరాజు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా బయటకు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

ధాన్యం కుంభకోణంలో నిందితులైన జంగిటి శ్రీనివాస్, గడ్డం స్వామి అలియాస్ నరసారెడ్డికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సన్నిహిత అనుచరులుగా ఉన్నవారే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కొనరావుపేట మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ప్రస్తుత డీసీసీ ప్రధాన కార్యదర్శి చేపూరి గంగాధర్‌కు చేపూరి మధుకర్ సోదరుడు కాదా అని ప్రశ్నిస్తూ, ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుల పాత్రపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వారు పేర్కొన్నారు.

చల్మెడ లక్ష్మీనరసింహారావుపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. దొంగతనానికి సంబంధించిన ధాన్యం బస్తాలు స్వయంగా పట్టుబడినప్పటికీ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు.

ఈ ధాన్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, రుద్రంగి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, కొనరావుపేట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, అంజద్ పాషా, సుంకపాక రాజు, సందీప్, కనకయ్య, పబ్బ మహేష్, ప్రేమ్ చారి, సంజీవ్, ఉప్పులుటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.