Shuru
Apke Nagar Ki App…
గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మానుకోట వార్తలు
గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.1
- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు... తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.2
- దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక! కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది. దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.1
- గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....3