*చంద్రన్న స్ఫూర్తితో రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి* *22నెలల కాలంలో రూ.120కోట్లతో రోడ్లు వేశాం.. ఎమ్మెల్యే పరిటాల సునీత* *రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. రామగిరి మండలం పోలేపల్లి పంచాయతీ అక్కంపల్లి గ్రామంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రసిద్ధి చెందిన చెన్నరాయునిస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు పేరు మీదుగా గోత్ర నామాలతో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అక్కంపల్లి సమీపం నుంచి చెన్నరాయుని స్వామి దేవస్థానం వరకు 1కోటి రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 16వందల మీటర్ల సిసి రోడ్డును స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రోడ్డుపై అందగా ముగ్గులు వేశారు. పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహించిన గ్రామస్థుల్ని ఎమ్మెల్యే అభినందించారు. చెన్నరాయునిస్వామి దేవస్థానం అభివృద్ధి కి 2లక్షల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఆలయానికి రోడ్డు వేయాలన్న సంకల్పం స్వామి వారు రాత్రికి రాత్రే కల్పించారన్నారు. తమకు భగవంతుడు ఈ అవకాశాన్ని ఇవ్వడం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతోనే రాప్తాడు నియోజకవర్గంలో ఈ22నెలల కాలంలో రూ.120 కోట్లతో బిటి, సీసీ రోడ్ల నిర్మాణం చేశామన్నారు. ఇందులో రామగిరి మండలంలో 20కోట్ల నిధులతో రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఇంకా గ్రామస్థులు కొన్ని పనులు అడిగారని.. వాటిని కూడా త్వరలోనే చేపడుతామన్నారు... *ఐకేపీ యానిమేటర్లకు సెల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే సునీత* రామగిరి మండలంలోని ఐకేపీ యానిమేటర్లకు ఎమ్మెల్యే పరిటాల సునీత సెల్ ఫోన్లు అందజేశారు. ముందుగా రామగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి 76వ జన్మదినం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా హ్యాపీ బర్త్ డే సీఎం సర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామగిరి మండలంలో ఉన్న 32 మంది ఐకెపి యానిమేటర్లకు సెల్ ఫోన్లను అందజేశారు. ప్రభుత్వం 15వేల విలువైన సెల్ ఫోన్లను అందజేస్తోందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సంఘాల పని తీరు పర్యవేక్షించడం, బుక్ కీపింగ్, బ్యాంకు లింకేజీ, రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ లేని రుణాలు, కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం, మనడబ్బులు - మన లెక్కలు అనే యాప్‌కు సంబంధించిన సేవలను నిర్వహిస్తున్న యానిమేటర్లకు ఈ సెల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. విధినిర్వహణలో భాగంగా కొన్ని యాప్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని.. ఈ పనుల కోసం సెల్ ఫోన్లు వినియోగించుకోవాలన్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని సూచించారు. *జనగణన ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలి* ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. రామగిరి మండల కేంద్రంలో అధికారులతో కలిసి జనగణన వివరాలను ఆమె ధ్రువీకరించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్వీయ జనగణన ప్రారంభమైందని.. ఈనెల 30 వరకు ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఇంటి వద్దకు సిబ్బంది వచ్చి జనగణన చేస్తారన్నారు. వీరికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంద్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరాలంటే ఖచ్చితమైన జనగణన గణాంకాలు అవసరమని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు...
*చంద్రన్న స్ఫూర్తితో రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి* *22నెలల కాలంలో రూ.120కోట్లతో రోడ్లు వేశాం.. ఎమ్మెల్యే పరిటాల సునీత* *రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. రామగిరి మండలం పోలేపల్లి పంచాయతీ అక్కంపల్లి గ్రామంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రసిద్ధి చెందిన చెన్నరాయునిస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు పేరు మీదుగా గోత్ర నామాలతో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అక్కంపల్లి సమీపం నుంచి చెన్నరాయుని స్వామి దేవస్థానం వరకు 1కోటి రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 16వందల మీటర్ల సిసి రోడ్డును స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రోడ్డుపై అందగా ముగ్గులు వేశారు. పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహించిన గ్రామస్థుల్ని ఎమ్మెల్యే అభినందించారు. చెన్నరాయునిస్వామి
దేవస్థానం అభివృద్ధి కి 2లక్షల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఆలయానికి రోడ్డు వేయాలన్న సంకల్పం స్వామి వారు రాత్రికి రాత్రే కల్పించారన్నారు. తమకు భగవంతుడు ఈ అవకాశాన్ని ఇవ్వడం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతోనే రాప్తాడు నియోజకవర్గంలో ఈ22నెలల కాలంలో రూ.120 కోట్లతో బిటి, సీసీ రోడ్ల నిర్మాణం చేశామన్నారు. ఇందులో రామగిరి మండలంలో 20కోట్ల నిధులతో రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఇంకా గ్రామస్థులు కొన్ని పనులు అడిగారని.. వాటిని కూడా త్వరలోనే చేపడుతామన్నారు... *ఐకేపీ యానిమేటర్లకు సెల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే సునీత* రామగిరి మండలంలోని ఐకేపీ యానిమేటర్లకు ఎమ్మెల్యే పరిటాల సునీత సెల్ ఫోన్లు అందజేశారు. ముందుగా రామగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి 76వ జన్మదినం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా హ్యాపీ బర్త్ డే సీఎం సర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామగిరి మండలంలో ఉన్న 32 మంది ఐకెపి యానిమేటర్లకు సెల్ ఫోన్లను అందజేశారు. ప్రభుత్వం 15వేల విలువైన సెల్ ఫోన్లను అందజేస్తోందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని
ఎమ్మెల్యే సూచించారు. సంఘాల పని తీరు పర్యవేక్షించడం, బుక్ కీపింగ్, బ్యాంకు లింకేజీ, రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ లేని రుణాలు, కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం, మనడబ్బులు - మన లెక్కలు అనే యాప్‌కు సంబంధించిన సేవలను నిర్వహిస్తున్న యానిమేటర్లకు ఈ సెల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. విధినిర్వహణలో భాగంగా కొన్ని యాప్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని.. ఈ పనుల కోసం సెల్ ఫోన్లు వినియోగించుకోవాలన్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని సూచించారు. *జనగణన ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలి* ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. రామగిరి మండల కేంద్రంలో అధికారులతో కలిసి జనగణన వివరాలను ఆమె ధ్రువీకరించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్వీయ జనగణన ప్రారంభమైందని.. ఈనెల 30 వరకు ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఇంటి వద్దకు సిబ్బంది వచ్చి జనగణన చేస్తారన్నారు. వీరికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంద్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరాలంటే ఖచ్చితమైన జనగణన గణాంకాలు అవసరమని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు...
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1