‘పల్లె నిద్ర’తో ప్రజల ముంగిట్లోకి పోలీసింగ్ గ్రామాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసి, వారిలో భరోసా నింపడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలతో మమేకమై స్నేహపూర్వక వాతావరణంలో సేవలందించాలని, క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం రాత్రి అధికారులు, సిబ్బంది ‘పల్లె నిద్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు, రక్షణ అవసరాలు, గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.
‘పల్లె నిద్ర’తో ప్రజల ముంగిట్లోకి పోలీసింగ్ గ్రామాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసి, వారిలో భరోసా నింపడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు
అధికారి, సిబ్బంది ప్రజలతో మమేకమై స్నేహపూర్వక వాతావరణంలో సేవలందించాలని, క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం రాత్రి అధికారులు, సిబ్బంది ‘పల్లె నిద్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై
వారి సమస్యలు, రక్షణ అవసరాలు, గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల
రక్షణపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు2
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు. అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. 1. Cr.No.139/2026 01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. 2. Cr.No.140/2026 16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు • రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది. • రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది. • మొత్తం రూ.30,900/- నగదు. • 67 ATM కార్డులు. • ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.4
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3