నంద్యాలలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ప్రారంభం : ఫిరోజ్ నంద్యాల పట్టణంలోని 16వ వార్డు ఎస్‌బీఐ కాలనీలో సుంకులమ్మ దేవాలయం వద్ద నుంచి టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ ఆధ్వర్యంలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన నాయకులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ఎన్‌ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ, ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, వార్డు ఇంచార్జ్ వీరసింహారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గోవిందా నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బోయ రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాలలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ప్రారంభం : ఫిరోజ్ నంద్యాల పట్టణంలోని 16వ వార్డు ఎస్‌బీఐ కాలనీలో సుంకులమ్మ దేవాలయం వద్ద నుంచి టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ ఆధ్వర్యంలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన నాయకులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ఎన్‌ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ, ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, వార్డు ఇంచార్జ్ వీరసింహారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గోవిందా నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బోయ రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.1