Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
Why not dinesh... yashaswi
ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.1
- మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.1
- బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు: కవిత బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.1
- సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.1
- జిల్లాలో సుమారు 85,800 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేరాయని వెల్లడించిన కలెక్టర్ విజయ సునీత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 85800 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేరాయని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. వీటిని ఎన్నికల సంఘం అన్ కలెక్టబుల్ గా పరిగణించబడినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా పై ఆగస్టు 30 వరకు ఓటర్ల క్లయిములు అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురిస్తామన్నారు1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1