ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

- పలుకూరు విద్యార్థులకు నగదు పురస్కారాలు బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనిపించిన సాయి దీపిక ఎస్ చంద్ర హసన్ 1200 ప్రకారం 3600 ఇవ్వడం జరిగినది అలాగే అచ్చిత రేష్మ చరిత కమ్మరి శరణ్య అనే విద్యార్థులకు ₹1000 ప్రకారం 3000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్య యొక్క విశిష్టత పై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందప్ప పరమేశ్వరుడు కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హెచ్ఎం గౌరీ శంకర్ ను బ్రహ్మానంద చారి ఘనంగా సన్మానించి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.2
- వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.1