మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.2
- నాగర్ కర్నూల్ జిల్లా వి బి జి రాంజీ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1