logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా డా బి ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు జగిత్యాల. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో మంగళవారం ఉదయం 11-30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద గల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా  నివాళులర్పించారు. ఈ సమావేశంలో  జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్,  DFO సురేష్, DPRO నరేష్, జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కౌన్సిలర్లు,స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ లు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ..డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మూల విలువలను రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన చూపించిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B. R. Ambedkar రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ (Articles) పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 👉అంతకుముందు అంబేద్కర్ జీవిత చరిత్ర మహనీయుల గొప్పతనం గురించి వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఉపన్యసించారు. 👉అంతకుముందు 'కళాజాత' కళాకారుల బృందం చే అంబేద్కర్ మహనీయుని గొప్పతనం గురించి పాటలు పాడి అందరిని అలరించారు. 👉అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

10 hrs ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
10 hrs ago

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా డా బి ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు జగిత్యాల. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో మంగళవారం ఉదయం 11-30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద గల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా  నివాళులర్పించారు. ఈ సమావేశంలో  జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్,  DFO సురేష్, DPRO నరేష్, జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కౌన్సిలర్లు,స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ లు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ..డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మూల విలువలను రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన చూపించిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B. R. Ambedkar రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ (Articles) పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 👉అంతకుముందు అంబేద్కర్ జీవిత చరిత్ర మహనీయుల గొప్పతనం గురించి వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఉపన్యసించారు. 👉అంతకుముందు 'కళాజాత' కళాకారుల బృందం చే అంబేద్కర్ మహనీయుని గొప్పతనం గురించి పాటలు పాడి అందరిని అలరించారు. 👉అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    1
    షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
  • నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ​జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ​పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.​ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.
    1
    నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
​జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
​పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.​ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. 
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.
    1
    నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter నేరడిగొండ, ఆదిలాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • *పత్రిక ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 14 :- *పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం చేశారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పరణాళికలో భాగంగా "అరైవ్ ఆలైవ్" లో భాగంగా వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతా నియమాలపై భద్రతా ప్రతిజ్ఞను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జయంతి ఉత్సవాలలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమనిబంధనలు పాటించి రోడ్డుపై ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తామని మరియు రాంగ్ సైడ్ ప్రయాణం, రాంగ్ రూటు ప్రయాణం రాష్ డ్రైవింగ్ లాంటివి చేయమని ప్రతిజ్ఞ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ప్రజలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గల అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పోలీసు సిబ్బంది ప్రజలచే భద్రతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, డిటిఓ శ్రీనివాస్, పట్టణ సీఐలు, ఎంవిఐలు, ఏఎంవిఐ లు,
    3
    *పత్రిక ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా, 
ఏప్రిల్ 14 :-
*పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం చేశారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పరణాళికలో భాగంగా "అరైవ్ ఆలైవ్" లో భాగంగా వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతా నియమాలపై భద్రతా ప్రతిజ్ఞను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జయంతి ఉత్సవాలలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమనిబంధనలు పాటించి రోడ్డుపై ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తామని మరియు రాంగ్ సైడ్ ప్రయాణం, రాంగ్ రూటు ప్రయాణం రాష్ డ్రైవింగ్ లాంటివి చేయమని ప్రతిజ్ఞ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ప్రజలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా గల అన్ని  పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పోలీసు సిబ్బంది ప్రజలచే భద్రతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, డిటిఓ శ్రీనివాస్,  పట్టణ సీఐలు,  ఎంవిఐలు, ఏఎంవిఐ లు,
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    12 hrs ago
  • జగిత్యాల : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో  ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు  వారం రోజుల పాటు  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత  పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ  పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది..  ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...
    1
    జగిత్యాల :
తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో  ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు  వారం రోజుల పాటు  ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత  పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ  పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది.. 
ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    4
    జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి.  మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే  సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా, మంగళవారం
ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు  హెల్మెట్లు అందజేశారు. 
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.