వరదలపై అవగాహనే ప్రాణరక్షణకు మార్గం ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం తగ్గించవచ్చు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ గణప సముద్రం సరస్సులో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల మాక్ డ్రిల్ గణపురం :వరదలపై అవగాహనే ప్రాణరక్షణకు మార్గమని ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం తగ్గించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ లు అన్నారు. మండలంలోని గణప సముద్రం సరస్సు వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరదలపై రక్షణ చర్యల డెమో కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదలు, నీటిలో మునిగే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలు తమను తాము రక్షించుకునేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సరైన అవగాహనతో మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని వరదల సమయంలో రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడానికి స్విమ్మింగ్ క్లబ్బులు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. గతంలో మోరంచపల్లి వాగు ప్రవాహం కారణంగా జరిగిన ప్రాణనష్టం ఘటనను గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఈ డెమో ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ దామోదర సింగ్, తహసీల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ లంక పెళ్లి భాస్కర్, గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరదలపై అవగాహనే ప్రాణరక్షణకు మార్గం ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం తగ్గించవచ్చు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ గణప సముద్రం సరస్సులో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల మాక్ డ్రిల్ గణపురం :వరదలపై అవగాహనే ప్రాణరక్షణకు మార్గమని ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం తగ్గించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ లు అన్నారు. మండలంలోని గణప
సముద్రం సరస్సు వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరదలపై రక్షణ చర్యల డెమో కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదలు, నీటిలో మునిగే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలు తమను తాము
రక్షించుకునేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సరైన అవగాహనతో మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని వరదల సమయంలో రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడానికి స్విమ్మింగ్ క్లబ్బులు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. గతంలో మోరంచపల్లి వాగు ప్రవాహం కారణంగా జరిగిన ప్రాణనష్టం ఘటనను గుర్తుచేస్తూ, అలాంటి
పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఈ డెమో ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ దామోదర సింగ్, తహసీల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ లంక పెళ్లి భాస్కర్, గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1