జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు అంశంపై వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ Satya Kumar Y గారు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.... జూనియర్ డాక్టర్లకు ప్రతి ఏటా 15% చొప్పున స్టైపెండ్ పెంచడం సముచితం కాదని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల తరహాలో ఏటా 3 నుంచి 4 శాతం మేర పెంపు చేయడమే సరైనదని 2022 నవంబర్‌లో అప్పటి వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారికంగా మెమో జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు నేడు అదే అంశంపై తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు న్యాయం చేసిందంటూ పాత జీవోలను ప్రస్తావిస్తూ గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని జగన్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఒక మాట చెప్పి, ఇప్పుడు మరో మాట చెప్పడం ద్వారా వాస్తవానికి, అబద్ధానికి మధ్య తేడా ఏమిటో జగన్‌రెడ్డియే స్పష్టం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. తమ ప్రభుత్వమే జారీ చేసిన 2022 మెమోకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పగలరా అని నిలదీసిన మంత్రి, తమ చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఎక్కడిదని నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు అంశంపై వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ Satya Kumar Y గారు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.... జూనియర్ డాక్టర్లకు ప్రతి ఏటా 15% చొప్పున స్టైపెండ్ పెంచడం సముచితం కాదని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల తరహాలో ఏటా 3 నుంచి 4 శాతం మేర పెంపు చేయడమే సరైనదని 2022 నవంబర్‌లో అప్పటి వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారికంగా మెమో జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు నేడు అదే అంశంపై తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు న్యాయం చేసిందంటూ పాత జీవోలను ప్రస్తావిస్తూ
గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని జగన్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఒక మాట చెప్పి, ఇప్పుడు మరో మాట చెప్పడం ద్వారా వాస్తవానికి, అబద్ధానికి మధ్య తేడా ఏమిటో జగన్‌రెడ్డియే స్పష్టం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. తమ ప్రభుత్వమే జారీ చేసిన 2022 మెమోకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పగలరా అని నిలదీసిన మంత్రి, తమ చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఎక్కడిదని నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1