Shuru
Apke Nagar Ki App…
వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
SHOT NEWS
వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.1
- కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు.1
- రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.1
- 2A భూముల వ్యవహారంలో నకిలీ జీవోలు, మెమోలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు 2A భూముల వ్యవహారంలో నకిలీ జీవోలు, మెమోలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.1
- తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.1
- దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్1