Shuru
Apke Nagar Ki App…
హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
K. UPENDER
హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- 2A భూముల వ్యవహారంలో నకిలీ జీవోలు, మెమోలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు 2A భూముల వ్యవహారంలో నకిలీ జీవోలు, మెమోలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.1
- కొత్తపల్లి గోరి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మహిళా సంఘాల భవనాలకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మంగళవారం సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడపాక గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల వివో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1